4వేల కిలోల పసుపుతో దుర్గమ్మ

Updated By ManamMon, 10/15/2018 - 22:13
durga-pandal
  • మంటపం మొత్తానికి పసుపుతోనే అలంకారం

  • కోల్‌కతా మంటపంలో వైవిధ్యం.. ఆసక్తికరం 

durga-pandalకోల్‌కతా: దసరా శరన్నవరాత్రులకు పశ్చిమబెంగాల్ పెట్టింది పేరు. ఆ రాష్ట్ర రాజధాని కోల్‌కతా నగరంలో ఒక మండపం ఏర్పాటుకు ఏకంగా 4వేల కిలోల పసుపును ఉపయోగించారు. సంతోష్‌పూర్ లేక్ పల్లి పూజా మండపంలో ఇలా పసుపుతోనే అంతా అలంకరించారు. అమ్మవారి విగ్రహం, చుట్టుపక్కల మండపం అంతా పసుపుతోనే చేసినా, అమ్మవారి చేతిలో ఉన్న అక్షయపాత్ర ఆరోగ్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా ఉందని అంటున్నారు. అమ్మవారి విగ్రహం కూడా పసుపుతోనే చేయడం, అలంకారాలకు వాడిన సహజ రంగులు అన్నీ చాలా అందంగా కనపడుతున్నాయి. ఈ మండపానికి స్పాన్సర్‌గా వ్యవహరించిన వ్యక్తి సుగంధ ద్రవ్యాలను ఉత్పత్తి చేస్తుంటారు. దాంతో అతడే మొత్తం 4వేల కిలోల పసుపును అందించాడు. పసుపు చాలా ఆరోగ్యకరమైన వస్తువని, అందుకే ఈసారి తాము ఈ కాన్సెప్టును ఎంచుకున్నామని జేకే మసాలే మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ జైన్ తెలిపారు. ఏ వంట చేసినా అందులో తప్పనిసరిగా పసుపు ఉంటుందని, అందువల్ల దీనిపై అవగాహన పెంచాలనే ఇలా ఏర్పాటుచేశామని అన్నారు. ఇది చాలా విభిన్నంగా ఉందని, ఇక్కడి సానుకూల శక్తితో ప్రతికూలతను తరిమేస్తుందని మండపాన్ని దర్శించుకోడానికి వచ్చిన రాజీవ్ లోధా అనే భక్తుడు అన్నారు. ఇది తమకు చాలా ఆసక్తికరంగా అనిపించందని చెప్పారు. పసుపు అనేక కీటకాలను హరిస్తుందని, ఇక్కడ ఉపయోగించిన ప్యాకెట్లుకూడా రీసైకిల్ చేయగలిగినవేనని సంతోష్‌పూర్ లేక్ పల్లి పూజా మండపం కమిటీ సభ్యుడు కౌస్తవ్ దాస్ చెప్పారు. బెంగళూరు, ఢిల్లీ లాంటి ప్రాంతాల నుంచి కూడా తమ మండపాన్ని చూసేందుకు భక్తులు వస్తున్నారని ఆయన సంతోషంగా తెలిపారు.

English Title
Durgamma with 4000 kg of yellow
Related News