ఆ ఉద్యోగాల్లో మహిళలొద్దు

railways
  • రైల్వే శాఖ సంచలన నిర్ణయం

  • డ్రైవర్లు, పోర్టులు, గార్డులు, ట్రాక్‌మెన్..

  • ఈ ఉద్యోగాలన్నీ పురుషులకే ఇవ్వాలి

  • పర్సనల్ విభాగానికి ఉన్నతాధికారుల లేఖ

న్యూఢిల్లీ: కఠినమైన, అనుకూల పని వాతావరణం లేని కొన్ని ఉద్యోగాల్లో మహిళలను తీసు కోకపోవడమే మంచిదని భారత రైల్వేశాఖ భావిస్తోంది. డ్రైవర్లు, పోర్టర్లు, గార్డులు, ట్రాక్‌మెన్ లాంటి పోస్టుల్లో కేవలం పరుషులనే తీసుకునేలా అనుమతి ఇవ్వాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ విభాగా నికి లేఖ రాసింది. ఇటువంటి ఉద్యోగాల్లో మహిళలకు సరైన భద్రత లేకపోవడమేగాక, కఠినమైన పనులు ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వేశాఖ చెబు తోంది. రైల్వే శాఖలో 13లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మహిళల సంఖ్య 2 నుంచి 3 శాతం మాత్రమే. వీరిలో చాలా మంది డెస్కుల్లో, కార్యాలయా ల్లో విధులు నిర్వహిస్తుండగా.. డ్రైవర్, గార్డులు, పోర్టర్లు, ట్రాక్‌మెన్ల పోస్టుల్లోనూ కొందరు మహిళలు ఉన్నారు. అయితే మహిళల పట్ల తమకు ఎలాంటి వివక్ష లేదని, కానీ కొన్ని పోస్టుల్లో విధుల సమయంలో వీరికి సరైన భద్రత ఉండట్లేదని, పని వాతావరణం కూడా సానుకూ లంగా లేదని రైల్వేశాఖ అభిప్రాయపడుతోంది. అందుకే ఇలాంటి పోస్టుల్లో పురుషులను మాత్రమే తీసుకోవాలని యోచిస్తోంది.  డ్రైవర్‌లు సాధారణంగా ఒక రైళ్లో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఇక గార్డులు సిగ్నళ్లు ఇచ్చేందుకు రైలు చివరి బోగిలో ఉంటారు. పోర్టర్లు రైల్వే స్టేషన్లలో బరువైన లగేజీలను ఎత్తాల్సి ఉంటుంది. రైల్వే ట్రాక్‌లను పరిశీ లించేందుకు ట్రాక్‌మెన్‌లను నియమిస్తారు. అయితే దీనిపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రయినింగ్ విభాగం ఇంతవరకూ స్పందించలేదు. కాగా.. రైల్వే ఉద్యోగుల యూనియన్ మాత్రం దీన్ని తప్పుబడుతోంది. ‘రైల్వేల్లో మహిళలకు సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవు. అందుకే మహిళలకు ఉద్యోగాలు ఇచ్చేందుకు రైల్వేశాఖ సుముఖంగా లేదు. మహిళలను తీసుకోకుండా ఉండే బదులు.. వారికి సదుపాయాలను మెరుగుపరిస్తే బాగుంటుంది’ అని ఉద్యోగ యూనియన్ సభ్యులు చెబుతున్నారు.

Tags

సంబంధిత వార్తలు