గోదాదేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు!

Updated By ManamWed, 01/10/2018 - 14:14
vairamuthu

vairamuthuగోదాదేవిపై తమిళ రచయిత వైరముత్తు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.   గోదాదేవిపై వైరముత్తు ఓ పత్రికకు రాసిన వ్యాసం దుమారం రేపుతోంది. ఇది దేవతామూర్తిగా పూజలందుకుంటున్న గోదాదేవి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని పలువురు మండిపడుతున్నారు. వైరముత్తు వ్యాఖ్యల పట్ల తమిళనాడు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. 

దేవతామూర్తిగా, మహిమాన్విత మూర్తిగా తమిళుల చేత పూజలందుకుంటున్న గోదాదేవిని దేవదాసిగా వ్యాఖ్యానించడం సరికాదని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ మండిపడ్డారు. తన వాఖ్యల పట్ల వైరముత్తు విచారం వ్యక్తంచేస్తే సరిపోదని...వెంటనే సదరు వ్యాస్యాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లిఖితపూర్వకంగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవడంతో పాటు...ఇకపై ఇలాంటి వ్యాసాలతో హింధువుల మనోభావాలను గాయపర్చబోనని క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. 

English Title
Controversy over Vairamuthu comments on Godhadevi
Related News