సుప్రీంకు కాంగ్రెస్!

Updated By ManamWed, 05/16/2018 - 15:37
Congress Thinks to Move Apex Court
  • బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే వెళ్లాలని యోచన

  • గవర్నర్‌తో సమావేశమైన ప్రధాన ఎన్నికల అధికారి

Congress Thinks to Move Apex Courtబెంగళూరు: కర్ణాటక రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న సమీకరణాలు రాజకీయ విశ్లేషకులనూ ఆలోచనలో పడేస్తున్నాయి. జేడీఎస్‌తో సర్కారు ఏర్పాటుకు తలపోసిన కాంగ్రెస్.. బీజేపీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లాలని యోచిస్తోంది. జేడీఎస్‌తో కలిస్తే తమకు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే స్థానాల కన్నా ఎక్కువే సంఖ్యా బలం ఉందని, అలాంటప్పుడు బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలిస్తే కచ్చితంగా సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ఇటు బుధవారం మధ్యాహ్నం గవర్నర్ వాజూభాయ్ వాలాను కర్ణాటక ఎన్నికల ప్రధానాధికారి సంజీవ్ కుమార్ కలిశారు. ఎన్నికల ఫలితాలను అందేజేశారు. ఫలితాల పరిశీలన అనంతరం ఒక్కో పార్టీతో విడివిడిగా సమావేశమయ్యేందుకు గవర్నర్ యోచిస్తున్నారు.

English Title
Congress Thinks to Move Apex Court
Related News