గట్టి పిండమే.. పూడ్చి 8 గంటలైనా బతికింది

Updated By ManamFri, 06/08/2018 - 13:20
Child Alive Even After buried for 8 hours

Child Alive Even After buried for 8 hoursచుట్టూ చిక్కటి చీకట్లు.. పోలీసు అధికారులు భూమిని తవ్వుతున్నారు.. ఓ చిన్నారిని వెలికి తీశారు.. వెంటనే అంబులెన్సుకు ఫోన్ చెయ్యండి అంటూ ఓ పోలీసు అధికారి స్వరం కేకేసింది.. అందరిలోనూ ఆనందం.. కారణం.. పూడ్చిపెట్టి 8 గంటలైనా సరే అప్పుడే పుట్టిన ఆ చిన్నారి బతికి ఉండడం. అవును, ఊపిరిపీల్చకుండా కొన్ని క్షణాలైనా ఉండలేం కదా.. 8 గంటలైనా ఆ పాప ఎలా బతికిందన్న అనుమానం రావొచ్చు. కానీ, నమ్మశక్యంగా లేని ఈ ఘటన బ్రెజిల్‌లో జరిగింది. 

ఇదీ జరిగింది..
భారత్‌కు చెందిన ఓ 15 ఏళ్ల బాలికకు ఆ పాప పుట్టింది. అయితే, బాత్రూంలో ఉన్న ఆ బాలికకు ఉన్నట్టుండి ప్రసవ వేదన మొదలవడంతో అక్కడే పాపకు జన్మనిచ్చింది. కానీ, ఆ పాప బాత్రూం నేలపై పడడంతో తలకు తీవ్రగాయమైంది. అయితే, వెనువెంటనే చిన్నారిని పైకి తీసినా చలనం లేకపోవడంతో.. చనిపోయిందని భావించిన ఆ బాలిక, ఆ బాలిక నాన్నమ్మలు పాపను ఇంటి వెనక పెరట్లో పూడ్చి పెట్టారు. అయితే, ఎవరైనా చనిపోతే అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న నిబంధన ఉంది. కానీ, వారు ఫిర్యాదు చేయకపోవడంతో పొరుగున ఉన్నవారు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వారొచ్చి ఆ సమాధిని తవ్వి పాపను బయటకు తీయగా బతికే ఉందని తెలిసింది.

హుటాహుటిన పాపను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ పాపకు కొన్ని టెస్టులు చేసి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. ప్రస్తుతం పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, తలలోని ఎముకలు విరిగాయని, మరికొన్ని రోజులు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలని వైద్యులు చెప్పారు. కాగా, తమ గిరిజన సాంప్రదాయం ప్రకారం చనిపోయిందనుకుని పూడ్చి పెట్టినట్టు చిన్నారికి జన్మనిచ్చిన బాలిక నాన్నమ్మ చెప్పడంతో పోలీసులు హత్యాయత్నం నేరం కింద ఆమెను అరెస్ట్ చేశారు. చిన్నారికి జన్మనిచ్చిన తల్లి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. పూడ్చి పెట్టి 8 గంటలైనా బతికిందంటే.. ఆ చిన్నారి నిజంగా గట్టి పిండమే మరి. 

English Title
Child Alive Even After buried for 8 hours
Related News