వానలోనూ నడక ఆపని జగన్

Updated By ManamFri, 07/13/2018 - 09:58
jagan

jagan  అమరావతి: ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఎండను, వానను లెక్కచేయకుండా తన యాత్రను కొనసాగిస్తున్నారు జగన్. ఈ క్రమంలో గురువారం తూర్పుగోదావరి జిల్లా ఓలపల్లిలో జడివాన కురవగా.. గొడుగు సాయంతో జగన్ తన యాత్రను కొనసాగించారు. మార్గమధ్యంలో రోడ్డుకు ఇరువైపులా బారులు దీరిన జనాలను పలకరించుకుంటూ ముందుకు సాగారు. అయితే కోర్టుకు హాజరుకానున్న నేపథ్యంలో శుక్రవారం జగన్ పాదయాత్రకు బ్రేక్ పడగా.. శనివారం యథావిధిగా తన పాదయాత్రను కొనసాగించనున్నారు.

English Title
Braving rain, Jagan continues his yatra
Related News