లాంచీ ప్రమాదం: 12 మృతదేహాలు వెలికితీత

Updated By ManamWed, 05/16/2018 - 17:03
Boat capsized in Godavari River | Twelve Dead Bodies Found | at Devipatnam

Boat capsized in Godavari River | Twelve Dead Bodies Found | at Devipatnam

తూర్పు గోదావరి: జిల్లాలో మంగళవారం సాయంత్రం లాంచీ మునిగిపోయిన సంగతి తెలిసిందే. గోదావరిలో మునిగిన లాంచీని ఎట్టకేలకు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బయటకు తీశాయి. ఈ ప్రమాదంలో చనిపోయిన 12 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో పదిమంది మృతదేహాల కోసం ఎన్టీఆర్ బృందాలు గాలిస్తున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. పదే పదే పడవ ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవట్లేదంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సహాయక చర్యల్ని ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు పర్యవేక్షిస్తున్నారు. భారీక్రేన్లతో మునిగిన లాంచీని ఒడ్డుకు చేర్చడం జరిగింది. మృతుల కుటుంబాలకు రూ. 10లక్షలు చొప్పున పరిహారం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఈ ఘటన జరిగి 24 గంటలవుతున్నా కనీసం లాంచీలో ప్రయాణించింది ఎంత మంది..? ఎంతమంది మృతిచెందారు.. ఎంతమంది ప్రాణాలతో బయటపడారన్న విషయం తేల్చలేకపోవడం గమనార్హం.

English Title
Boat capsized in Godavari River | Twelve Dead Bodies Found | at Devipatnam
Related News