బంధన్ బ్యాంకుకు పెరిగిన లాభాలు

Bandhan bank
  • 10 శాతం వృద్ధితో రూ. 300 కోట్ల నికర లాభం

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగంలోని బంధన్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో 10 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ. 300 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.331 కోట్లకు ఎగసిందని బంధన్ బ్యాంక్ తెలిపింది. ఈ బ్యాంక్ నికర లాభంపై కూడా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ గ్రూప్ రుణ భారం ప్రభావం చూపించింది. ఈ సంస్థకు ఇచ్చిన రుణాలకు ఈ బ్యాంక్ పూర్తిగా కేటాయింపులు జరపాల్సి వచ్చింది. ఈ కేటాయింపులు లేకపోతే, నికర లాభం మరింతగా పెరిగి ఉండేది. కాగా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు ఏ మాత్రం రుణాలిచ్చిందనేది ఈ బ్యాంక్ వెల్లడించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ రుణాల పుణ్యమాని ఈ  బ్యాంక్ మొండి బకాయిలు భారీగా పెరిగాయి. గత క్యూ3లో రూ. 1,336 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో  41 శాతం వ ద్ధితో రూ.1,884 కోట్లకు ఎగసిందని బ్యాంక్ ఎమ్‌డీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్  చంద్ర శేఖర్ ఘోష్ తెలిపారు. రుణాలు 46 శాతం వ ద్ధి చెంది రూ.35,599 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రుణ వ ద్ధి జోరుగా ఉండటం, మార్జిన్లు పటిష్టంగా(10.5 శాతం) ఉండటంతో నికర వడ్డీ ఆదాయం 54 శాతం ఎగసి  రూ.1,124 కోట్లకు పెరిగిందని తెలిపారు.  ఇతర ఆదాయం 48 శాతం పెరిగి రూ.234 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ లాభం రూ.574 కోట్ల నుంచి 57 శాతం పెరిగి రూ.900 కోట్లకు చేరిందని తెలిపారు. గత క్యూ3లో 9.9 శాతంగా ఉన్న నికర వడ్డీ మార్జిన్ ఈ క్యూ3లో 10.3 శాతానికి పెరిగిందని వివరించారు.  

సంబంధిత వార్తలు