‘ఖేల్ రత్న’పై కోర్టుకు వెళ్లనున్న బజరంగ్

Updated By ManamThu, 09/20/2018 - 22:58
Bajrang
  • కేంద్ర ప్రభుత్వాన్ని బెదిరించిన రెజ్లర్  

imageన్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ‘ఖేల్ రత్న’ అవార్డుకు తనను నిర్లక్ష్యం చేశా రని మదనపడుతున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా కేంద్ర ప్రభుత్వంపై న్యాయపోరాటానికి దిగనున్నాడు. ఈ ఏడాది గోల్‌కోస్ట్ కామన్వెల్త్, ఆసియా గేమ్స్‌లలో స్వర్ణ పతకాలు సాధించిన పూనియా పేరును భారత రెజ్లింగ్ సమాఖ్య ఖేల్త్న్ర అవార్డుకు సిఫారసు చేసింది. అయితే అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన టీమిండియా కెప్టెన్  కోహ్లీ, వెయిట్‌లిఫ్టర్ చానువైపు సెలెక్షన్ కమిటీ మొగ్గు చూపింది. ఈ నిర్ణయం బజరంగ్‌కు నచ్చలేదు. తన పేరును పరిశీలించాలని శని వారం క్రీడల మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌ను కలిసి విన్నవించ నున్నాడు. అయితే ఒకవేళ క్రీడల మంత్రి ఒప్పుకోకపోతే కోర్టును అ శ్రయిస్తారా అన్న ప్రశ్నకు సమాధానమి స్తూ..అది చివరి అప్షన్ అని చెప్పాడు. 

English Title
Bajrang is going to court on 'Khel Ratna'
Related News