పెద్ద నోట్ల రద్దునాటి డిపాజిట్లపై ఆరా

Updated By ManamWed, 06/13/2018 - 22:34
Note-ban-fallout

Note-ban-falloutన్యూఢిల్లీ: పెద్ద నోట్లు రద్దు అయిన 2016 నవంబర్ కాలంలో బ్యాంకుల్లో రూ. 10 లక్షలు, అంతకుమించిన నగదు డిపాజిట్ చేసినవారు 90,000 మందికి పైగా ఉన్నారు. 2018 మార్చి 31 నాటికి పన్ను రిటర్నులు దాఖలు చేయనందుకుగాను వారంతా ఆదాయ పన్ను శాఖ నిశిత పరిశీలనలో ఉన్నారు. పెద్ద నోట్లను మార్పిడి చేసుకోవాలని ప్రకటించిన తర్వాత బ్యాంకు ఖాతాల్లో రూ. 10 లక్షలు లేదా అంతకుమించిన మొత్తాలను డిపాజిట్ చేసి, పన్ను రిటర్నులు దాఖలు చేయని దాదాపు 3 లక్షల మందికి ఆదాయ పన్ను శాఖ నోటీసులు జారీ చేసింది. ‘‘వారిలో దాదాపు 2.1 లక్షల మంది 2018 మార్చి 31 గడువు నాటికి రిటర్నులు దాఖలు చేశారు. మిగిలినవారు ఇప్పుడు చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని ఆదాయ పన్ను శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. రిటర్నులు దాఖలు చేయకపోతే, పన్ను అధికారులు నోటీసులు పంపి, కట్టవలసిన పన్ను భారంలో 50 శాతం నుంచి 200 శాతం వరకు మొత్తాన్ని అపరాధ రుసుముగా విధించడానికి అవకాశం ఉంది. అలాగే, ఆలస్యంగా చెల్లిస్తున్న దానిపై పన్ను చెల్లించే తేదీ వరకు వడ్డీ లెక్కకట్టి ఇవ్వాల్సి ఉంటుంది. నాన్-ఫైలింగ్ ప్రాసిక్యూషన్‌కు కూడా దారి తీయవచ్చు. భారతీయ చట్టాలలోని శిక్షా నిబంధనలు చాలా కఠినమైనవని డెలాయిట్ ఇండియాలో సీనియర్ డైరెక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ‘‘పన్ను అధికారులు ఈ కేసులను గుప్త ధన చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం వంటి వివిధ ఇతర చట్టాల కింద పరిశీలనకు పంపే అవకాశం కూడా ఉంది. ఒక్కో చట్టానికి ఒక్కో రకమైన పర్యవసానాలుంటాయి’’ అని సంజయ్ కుమార్ అన్నారు. 
‘ఆపరేషన్ క్లీన్ మనీ’కి చెందిన మూడు దశల్లో ఇంతవరకు ఆదాయ పన్ను శాఖ దాదాపు 22.69 లక్షల మందిని గుర్తించింది. పెద్ద నోట్ల రద్దు కాలంలో వారు డిపాజిట్ చేసిన నగదుకు, వారి పన్ను రేఖా సూచన చిత్రాలకు పొంతన లేనట్లు కనుగొంది. ఈ 22.69 లక్షల మంది ఆ కాలంలో సుమారు రూ. 5.27 లక్షల కోట్లు డిపాజిట్ చేశారు. అయితే, అటువంటి లావాదేవీల్లో  పద్దుల్లో కనిపించని ఆదాయం ఎంత ఉందో పన్ను అధికారులు ఇంకా గ్రహించవలసి ఉంది. దాని మదింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓ.సి.ఎం మొదటి దశలో మొదట భారీ నగదు డిపాజిట్ల కేసులను ఈ-వెరిఫికేషన్‌కు ఎంచుకున్నారు. ఈ-వెరిఫికేషన్ కింద ఆదాయ పన్ను శాఖ ఆ నగదు వనరులకు సంబంధించి వివరణ కోరింది. దానికి 11 లక్షల మంది జవాబిచ్చారు. 

English Title
Ask for deposit of large banknotes
Related News