థెరపీవా చేతికి ఏపీఐ

Updated By ManamMon, 10/15/2018 - 22:13
dr-reddy
  • విక్రయానికి డాక్టర్ రెడ్డీస్ నిర్ణయం

dr-reddyహైదరాబాద్: జీడిమెట్లలో ఉన్న యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్స్ (ఏ.పి.ఐ)ని ప్రవర్థమాన జనరిక్స్ ఫార్మాస్యూటికల్ కంపెనీ థెరపీవాకు విక్రయించేందుకు ఖరారు ఒప్పందం కుదిరినట్లు డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సోమవారం ప్రకటించింది. అబుదబికి చెందిన నియోఫార్మా ఎల్‌ఎల్‌సికి పూర్ణ స్వామిత్వ అనుబంధ సంస్థ అయిన ఆమ్నికేర్ డ్రగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, లాక్సై లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కలసి సంయుక్త రంగంలో థెరపీవా సంస్థను నెలకొల్పాయి. ఏ.పి.ఐని ఉన్నదున్నట్లుగా విక్రయిస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సంస్థకున్న (భూములు, భవనాలతో సహా) స్థిరాస్తులు , ప్రస్తుత ఆస్తులు, ప్రస్తుత అప్పులను, సిబ్బందిని ఉన్నపళంగా అప్పగిస్తున్నట్లు  పేర్కొంది. వస్తూత్పత్తి కార్యకలాపాలను క్రమబద్ధం చేసుకోవడం, వ్యయ విధానాల నుంచి సర్వోత్తమ ఫలితాలు సర్వోత్తమ ఫలితాలు సాధించే దిశగా ఏ.పి.ఐని విక్రయిస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ సంస్థలో గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ల విభాగ అధిపతి, ఎగ్జిక్యూటివ్  ఉపాధ్యక్షుడు సంజయ్ శర్మ చెప్పారు. ‘‘ఈ వ్యాపార విభాగాన్ని, దాని సిబ్బందిని వ్యూహాత్మక ఆస్తిగా మెచ్చుకోగల, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోగల కొనుగోలుదారు-భాగస్వామిని థెరపివాలో కనుగొన్నామని మేం నమ్మకంగా చెప్పగలం’’ అని ఆయన అన్నారు. ‘‘యాక్టీవ్ ఫార్మాస్యూటికల్ ఇన్‌గ్రెడియంట్ల ప్రధాన సరఫరాదారుగా థెరపీవాకున్న స్థాయిని మరింత పటిష్టపరచుకునేం దుకు ఉన్న ఒక అనన్యమైన అవకాశానికి ఈ స్వాధీనం ప్రాతినిధ్యం వహిస్తోంది. మా కంపెనీల మధ్య పటిష్టమైన సాంస్కృతిక బంధం ఉంది. మా ఆశావహమైన వృద్ధి ప్రణాళికలను వేగవంతం చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ఉద్యోగులను స్వాగతిస్తున్నందుకు మాకు ఉత్తేజదాయకంగా ఉంది’’ అని థెరపీవా, లాక్సై లైఫ్ సైన్సెస్ ప్రధాన కార్యనిర్వహణాధికారి మద్దిపట్ల వంశీ అన్నారు. ‘‘ఈ స్వాధీనం పట్ల మేం ఎంతో సంతోషంగా ఉన్నాం. దీనివల్ల నియోఫార్మా వెర్టికల్ ఇంటెగ్రేషన్ అనుకూలత పెంపొందుతుంది. ఇండియాలో ఉన్నత ప్రమాణాలతో కూడిన వస్తూత్పత్తి కేంద్రం మాకు సమకూరుతోంది’’ అని అబుదబిలోని నియోఫార్మా ఎల్.ఎల్.సి చైర్మన్ బి.ఆర్. షెట్టి అన్నారు. టెన్నిసీలో బ్రిస్టల్‌లో ఉన్న యాంటిబయాటిక్ మందుల తయారీ కేంద్రాన్ని, దాని అనుబంధ అస్తులను డాక్టర్ రెడ్డీస్ ఇటీవల నియోఫార్మా ఇన్‌కార్పొరేటెడ్‌కు విక్రయించిన సంగతి తెలిసిందే. 

Tags
English Title
API for therapy hand
Related News