వీడియో: యాంకర్ సుమ ఐస్‌క్రీం తింటుంటే..

Updated By ManamThu, 06/07/2018 - 11:46
Anchor Suma Kanakala, Ice cream breath like dragon
  • డ్రాగన్‌ శ్వాసలా పొగ వస్తుంది.. వామ్మో సుమా..!

Anchor Suma Kanakala, Ice cream breath like dragonబుల్లితెరపై యాంకర్‌గా మంచి గుర్తుంపు తెచ్చుకున్న టీవీ యాంకర్ సుమ కనకాల.. తన మాటలతో, విసిరే పంచ్‌లతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేయగలరు. ఆడియో ఫంక్షన్లు కావొచ్చు.. టీవీ కార్యక్రమాల్లో ఏ షోకు హోస్ట్‌గా వ్యవహరించినా అద్భుతంగా ఆ షోకు ఫుల్ క్రేజ్ తెచ్చిపెట్టగల నైపుణ్యం ఆమె సొంతం. టీవీ షోల్లో మాత్రమే కాకుండా ఇటీవల సోషల్ మీడియాలో కూడా సుమ యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఆమె సోషల్ మీడియాలోనూ తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి నెటిజన్లను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోస్టు చేసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో సుమ హాయిగా ఐస్‌క్రీమ్‌ తింటూ కనిపించారు.

ఐస్‌క్రీమ్‌ తినేటప్పుడు ఆమె నోట్లో నుంచి, ముక్కులో నుంచి పొగలు రావడం గమనించారా? ఆ సమయంలో సుమ తనదైన శైలిలో హావభావాలు పలకిస్తూ, ఐస్‌క్రీమ్‌ రుచిని ఎంతోగానూ ఆస్వాదించారు. ఐస్‌క్రీమ్‌ తింటూ ముక్కులో నుంచి పొగలు వదలుతూ.. ఆమె నవ్వుతూ అందర్నీ నవ్వించారు. ఈ వీడియోను పోస్టు చేసిన సుమ.. చివరగా ‘‘ఓ డ్రాగన్‌ వదిలే శ్వాసలా పొగ వస్తుంది చూడండి.. వామ్మో..’’ అని పోస్టు పెట్టారు. కాగా, ఫేస్‌బుక్‌లో సుమకు దాదాపు 3 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉండగా, ఈ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 1,061 షేర్లు, 10వేల లైకులు, 176వేల వ్యూస్ వచ్చాయి. ఇదే ఆ వీడియో..

English Title
Anchor Suma Kanakala Ice cream funny video viral
Related News