ప్రారంభమైన అల్లు శిరీశ్ చిత్రం

Updated By ManamMon, 06/18/2018 - 12:07
Allu Sirish

Sirish  ‘ఒక్క క్షణం’ తరువాత దాదాపు ఆరు నెలలకు పైగా గ్యాప్ తీసుకున్న అల్లు శిరీశ్‌ తదుపరి చిత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హీరో హీరోయిన్లపై నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, నిర్మాత సురేశ్ బాబు కెమెరా స్విచ్చాన్ చేశారు. మలయాళంలో విజయం సాధించిన ఏబీసీడీ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. ఇందులో శిరీశ్ సరసన రుక్సార్ నటించనుంది. ఒకప్పటి బాల్య నటుడు భరత్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రినికి సందీప్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. మధుర శ్రీధర్, యశ్ రంగనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జుడా శాండీ అనే కన్నడ మ్యూజిక్ డైరక్టర్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

English Title
Allu Sirish new film started
Related News