మిషన్ ది ఎండ్.. అంతా క్షేమం..!

Updated By ManamTue, 07/10/2018 - 19:05
All 12 boys, football coach, Thai cave rescued, Mission accomplished
  • గుహలో చిక్కుకున్న కోచ్ సహా 12మంది చిన్నారులు సురక్షితం

  • ముగిసిన సహాయక చర్యలు.. థాయ్‌లాండ్‌లో సంబరాలు..

  • ప్రత్యేక అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి చిన్నారుల తరలింపు

All 12 boys, football coach, Thai cave rescued, Mission accomplishedమే సాయి(బ్యాంకాక్): థాయ్‌లాండ్‌లో సందడి వాతావరణం నెలకొంది. గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్‌ కోచ్‌ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ సహాయక సిబ్బంది సాహసోపేత చర్యలతో 18 రోజుల తరువాత నలుగురు చిన్నారులను, కోచ్‌ను క్షేమంగా బయటకు తీసుకువచ్చారు. ఈ మేరకు థాయి నేవీ సీఎల్స్ మంగళవారం ప్రకటించింది. ‘‘గుహలో చిక్కుకుపోయిన 12 మంది చిన్నారులు, కోచ్‌ను క్షేమంగా బయటకు తీసుకవచ్చాం’’ అని థాయి నేవీ ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది. అనంతరం రక్షించిన వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. డైవర్ల సహాయంతో ఆదివారం నలుగురు చిన్నారులను, సోమవారం మరో నలుగురు చిన్నారులను రెస్య్కూ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్‌ గుహ చూడడానికి ఈ 12 మంది చిన్నారులు, ఫుట్ బాల్ కోచ్ వెళ్లగా వరద ఉద్ధృతి పెరగడంతో అందులోనే చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే.

తొమ్మిది రోజుల తర్వాత వారిని బ్రిటిష్‌ గజ ఈతగాళ్లు కనిపెట్టారు. కానీ, గుహలో నీటి మట్టం పెరగడం, బురద కూరుకుపోయిన కారణంగా చిన్నారులను బయటకు తీసుకురావడం సవాలుగా మారింది. ఎట్టకేలకు పలు విదేశీ డైవర్లు, థాయ్‌ డైవర్లు కలిసి చిన్నారులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చిన చిన్నారులను కలిసేందుకు వారి తల్లిదండ్రులకు అధికారులు అనుమతి ఇవ్వడం లేదు. థాయ్‌లాండ్‌ ప్రధానమంత్రి ప్రయుత్‌ చాన్‌-ఓచా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను పరామర్శించినట్టు సమాచారం. 

English Title
All 12 boys and football coach trapped in flooded Thai cave rescued after 18 days
Related News