వామ్మో.. రియల్ భారీ అలిగేటర్..

Updated By ManamTue, 07/10/2018 - 18:22
600 kgs crocodile, caught after eight-year hunt, big as family car
  • ఎనిమిదేళ్లగా గాలింపు.. ఎట్టకేలకు చిక్కిన భారీ మొసలి

  • కాథరైన్‌ నది దిగువన పట్టుకున్న ఆస్ట్రేలియా రేంజర్లు

600 kgs crocodile, caught after eight-year hunt, big as family carసిడ్నీ: అదో భయంకరమైన ఓ మొసలి. చూడటానికి హాలీవుడ్ సినిమాల్లోని భారీ అలిగేటర్‌లా ఉంది కదూ.. దీని బరువు ఎంతో తెలుసా? సుమారు 600 కిలోలు.. దాదాపు 4.7 మీటర్ల పొడవు ఉంటుంది. తొలిసారి 2010లో కనిపించిన ఈ భారీ మొసలి కోసం ఎనిమిదేళ్లుగా ఆస్ట్రేలియా అధికారులు వెతుకుతున్నారట. ఇన్నాళ్ల తరువాత ఎట్టకేలకు భారీ అలిగేటర్‌ను పట్టుకున్నట్టు మంగళవారం ఆస్ట్రేలియా రేంజర్స్ వెల్లడించారు. దక్షిణ డార్విన్‌కు 37 మైళ్ల దూరంలోని కాథరైన్‌ నది దిగువన ఉన్న నీటిలో ఈ భారీ మొసలిని పట్టుకున్నారు. ఈ మొసలి వయసు 60ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు.

ఈ మొసలిని పట్టుకునేందుకు ఎన్నోఏళ్లుగా శ్రమించామని, ఇప్పుడు దానిని చూస్తే కాస్త థ్రిల్‌గా ఉందని సీనియర్‌ వైల్డ్‌లైఫ్ ఆఫీసర్‌ జాన్‌ బుర్కే విలేకరులకు తెలిపారు. దాన్ని ముసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించారు. కాథెరైన్‌ నది నుంచి పట్టుకున్న అతి పెద్ద మొసలి ఇదేనని తెలిపారు. ఇంత భారీ సైజు పరిమాణంలో ఉన్న అలిగేటర్‌ను చూడగానే రేంజర్లు సైతం ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. అక్కడి వైల్డ్‌లైఫ్‌ రేంజర్లు ఏడాదికి సమస్యాత్మకంగా ఉన్న 250 మొసళ్లను పట్టుకుంటారు. ఆస్ట్రేలియాలో ఉప్పునీటి మొసళ్లు చాలా సర్వసాధారణం. వీటి కారణంగా ఏటా సగటున ఇద్దరు ప్రాణాలు కోల్పోతున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది.
(‘భారీ మొసలి’ ఫొటోగ్యాలరీ..)

English Title
600 kgs crocodile caught after eight-year hunt
Related News