బషీర్‌బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం

Updated By ManamThu, 05/17/2018 - 19:46
5 Storey Building fire broke, Bashirbhag area, Short circuit, Fire fighters
  • ఐదు అంతస్తుల భవనంలో దట్టమైన పొగలు.. భారీగా ఎగసిపడుతున్న మంటలు

  • మహవీర్ భవనంలో మంటలను అర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది..

  • షాట్ సర్క్యూట్ వల్లే ప్రమాదమని అనుమానాలు

5 Storey Building fire broke, Bashirbhag area, Short circuit, Fire fightersహైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్‌లోని చౌరస్తాలో ఐదు అంతస్తుల భవనంలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. మహవీర్ భవనంలో నుంచి భారీగా మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. భవనంలో నుంచి పెద్దఎత్తున పొగలు వ్యాపించడంతో అప్రమత్తమైన అధికారులు రిస్క్కూ టీం, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన ఈ ఐదు అంతస్తుల భవనంలో బ్యాంకు సంస్థల కార్యాలయాలతో పాటు మరికొన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నట్టు తెలుస్తోంది.

భవనంలోని నాలుగు, ఐదు అంతస్తుల నుంచి దట్టమైన పొగలతో భారీగా మంటలు ఎగసపడుతున్నాయి. భవనంలో కింది అంతస్తుల్లో ఉన్నవారిని ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నుంచి ఖాళీ చేయించినట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఈ అగ్నిప్రమాద ఘటన షాట్ సర్క్యూట్ వల్లే జరిగినట్టు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English Title
5 Storey Building fire broke out in a Bashirbhag
Related News