ఈ నెల 14న ఘనంగా బయోడైవర్సిటి ఫెస్టివల్

Lunarayak tanda

హైదరాబాద్: చిరుధాన్యాల సాగుపై అవ గాహన కల్పించేందుకు మెదక్ జిల్లాలో ఓ సదస్సును ఏర్పాటు చేసేందుకు ఓ గ్రామం ముందుకోచ్చింది. ఇక, నాణ్యమైన సాగు చేసేందుకు రైతులతో పాటు, వ్యవసాయ శాఖాదికారులు, మేదావులు, పలువురు ప్రోఫెసర్లతో జహిరాబాద్ లో లచ్చునాయక్ తండా వాసులు శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా ఈ నెల 14వ తేదీన లచ్చు నాయక్ తండాలో బయోడైవర్సిటి ఫెస్టివల్ (మొబైల్) ను నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్‌కు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్‌ను స్థానిక మహిళలు కృష్ణావేణి, చంద్రమ్మ, అంజమ్మ, లక్ష్మమ్మ, అనుసుయమ్మలు కలిసి గురువారం ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా గురువారం తనను పౌర సరఫరాల భవన్‌లో కలిసి ఆహ్వానించిన మహిళలతో కమీషనర్‌తో సమావేశమయ్యారు. అయితే, వారు చేస్తున్న అవగాహనకార్యక్రమం మరింత ముందుకుపోవాలని, విజయం సాధించేందుకు ప్రభుత్వం తరపునా వారికి సహకరించనున్నట్లు..తెలిపిన ఆయన అ కార్యక్రమానికి కూడా హజరవుతున్నట్లు చెప్పారు. 

సంబంధిత వార్తలు