ఈ నెలలో మ్యూచువల్ ఫండ్లు, బ్యాంకులకు కమర్షియల్ పేపర్లు జారీ చేయడం ద్వారా రూ. 1775 కోట్లు సమీకరించినట్లు పి.ఎన్.బి హౌసింగ్ ఫినాన్స్ సోమవారం వెల్లడించింది.
మల్టీప్లెక్స్ ఆపరేటర్ ఐనాక్స్ లీజర్ 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి 2.48 శాతం పెరుగుదలతో రూ. 11.97 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెక్యూరిటీల విక్రయం ద్వారా రూ. 1000 కోట్లు సమీకరించాలని భావిస్తోందని, ఆ మొ త్తాన్ని నూతన రాజధాని అమరావతి వృద్ధికి ఉపయోగించనుందని గెజిట్ నోటిఫికేషన్ ఒకటి తెలియజేసింది.
జి.ఎస్.టి రేటు తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారులకు బదలీ చేయకుండా ఎఫ్.ఎం.సి.జి దిగ్గజం నెస్లే ఇండియా అక్రమంగా సుమారు రూ. 100 కోట్లు ఆర్జించినట్లు అక్రమ లాభార్జన నిరోధక డైరెక్టొరేట్ జనరల్ (డీజీఏపీ) దర్యాప్తులో వెల్లడైంది.
దేశంలో ద్విచక్ర వాహనాల తయారీలో పెద్ద సంస్థ  అయిన హీరో మోటోకార్ప్ డెస్టినీ 125 వాహనంతో సోమవారం 125 సి.సి. స్కూటర్ల విభాగంలోకి అడుగుపెట్టింది.
దేశంలో మార్కెట్లో ప్రవేశపెట్టిన కేవలం ఐదు నెలల్లోనే కాంపాక్ట్ సెడాన్ ఎమేజ్ కారు అమ్మకాల్లో 50,000 మైలు రాయిని అధిగమించినట్లు హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ సోమవారం వెల్లడించింది.
భారతీయ ఈక్విటీలు వరుసగా మూడో సెషన్‌లో సోమవారం దిగువ గతిలో పయనాన్ని కొనసాగించాయి.
మల్‌విందర్ సింగ్, శివిందర్ సింగ్‌ల నుంచి, రెలిగేర్ ఫిన్‌వెస్ట్ లిమిటెడ్‌తో సహా ఇతర సంస్థల నుంచి రావలసిన రూ. 403 కోట్ల బకాయిలను వడ్డీతో సహా  రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మార్కెట్ నియంత్రణ సంస్థ ‘సెబి’ ఫోర్టిస్ హెల్త్‌కేర్‌ను ఆదేశించింది.
రసాయనాలులేని ఆ ఆహార ఉత్పత్తులను విక్రయించనున్నట్లు  ప్రముఖ హోల్ సేల్ విక్రయ సంస్థ మెట్రో క్యాష్ అండ్ కారీ ప్రకటించింది.
ఎస్.బి.ఐ లైఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 11 శాతం పెరుగుదలతో రూ. 250.53 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.


Related News