ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏఓబి)లోని చిత్రకొండ జలా శయం పేరు చెప్పగానే మావోయిస్టుల భయంకర దాడిలో పదుల సంఖ్యలో భద్రతా బలగాల మరణం గుర్తుకొస్తుంది.
పశుపాలక సంచారజాతుల భూములను ప్రభుత్వాలు సహా ఎవ్వరు ఆక్రమించకుండా చట్టపరమైన రక్షణలు కల్పించాలి. వారి ధన, మన ప్రాణాలకు రక్షణ కల్పించే చట్టాలను రూపొందించి, అమలు పరచాలనే అంశంపై అసిఫా బానో బలిదానం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో కనువిప్పు కలిగించగలదని ఆశిద్దాం.
దేశంలోని కరువు పరిస్థితులపై కొత్తకొత్త నిబంధనలతో కేంద్రం చేతులు దులిపేసుకునే చర్యలకు పాల్పడుతోంది. మహారాష్ట్రలోని అనేక గ్రామాలు నీటి సమస్యను ఎదుర్కొంటుండగా మరోపక్క కేంద్రం నుంచి తగినసాయం అందకపోవడంతో గ్రామీణులు తీవ్ర ఇబ్బందుల నెదుర్కొంటున్నారు.
దేశంలోని ప్రతి ఒక్కరికి 2019 అక్టోబర్ రెండో తేదీనాటికి ఇల్లుండాలన్నది స్వచ్ భారత్ లక్ష్యం. స్వచ్ భారత్ మిషన్ తన లక్ష్యాన్ని ఇప్పటికే 85 శాతం సాధించిందని కేంద్రం ప్రకటిస్తోంది.
ప్రతి ఉద్యోగి సమ్మె చేసినప్పుడల్లా  వారికిచ్చే జీతభత్యాలు, వసతులు పెంచుకుంటూ పోతుంటే ముగింపు ఎక్కడ? ఏడాదికి వంద నుంచి 150 రోజుల సెలవులను ఎంజాయ్ చేస్తూ, ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఉంటే, ఈ భారమంతా సామాన్యుడిపై పడుతుంది.
దేశంలోని అన్ని లౌకిక రాజకీయ శక్తులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే ఈ శక్తులను తీవ్రంగా అడ్డుకోవలసి ఉంటుంది. బీజేపీ/ఆరెస్సెస్‌పై చంద్రబాబు చేసేది చాలా కీలకమైన పోరాటం. దేశంలోని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు పూర్తిగా నష్టపోక ముందు దేశం ఈ శక్తుల నుంచి కాపాడబడాలి.
ప్రపంచంలో జరుగుతున్న విశేషాలు తెలుసుకుందామని ఏటీవీ న్యూస్ ఛానెల్ పెట్టినా, రేడియో ఆన్ చేసినా, వార్తా పత్రికలు తిరగేసినా మనకు ప్రముఖంగా కనిపించేవి, విని పించేవి శీతల పానీయాలకు సంబంధించిన వ్యాపార ప్రక టనలే!
మధ్యప్రదేశ్ మాండశౌర్‌లో పోలీసు కాల్పులకు ఆరుగురు రైతులు మృతిచెంది ఏడాది పూర్తయిన నేపథ్యంలో రైతులు తమ పనులకు స్వస్తి చెప్పి నగరాలకు, పట్టణాలకు పాలు, కూరగాయలు పదిరోజుల పాటు సరఫరా చేయరాదని నిర్ణయించుకున్నారు.
ప్రజాస్వామ్యదేశంలో ప్రజలే దేవుళ్లు. ప్రజాసంక్షేమమే.. దేశసంక్షేమంగా ప్రజాప్రతి ని ధులు భావించాలి. ఆ దిశగా పాలకులు కదిలినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.
కర్ణాటక ఎన్నికలు ముగిసిన వెంటనే దేశంలో పెట్రో ల్, డీజిల్ ధరలకు రెక్కలు రావటంతో సామాన్యుని ఇబ్బందులు వర్ణనాతీతం. మే 21, 2018న చారిత్రక రికార్డు నమోదు చేస్తూ పెట్రోల్ ధర 84 రూ.లకు ముంబాయిలో పెరిగింది.


Related News