పెడన వైసీపీలో వర్గపోరు.. తీవ్ర ఉద్రిక్తత

Updated By ManamFri, 11/09/2018 - 20:06
Ysrcp, Uppala ramprasad, Jogi ramesh, two division workers, fight themselves, Pedana
  • జోగిరమేశ్ కారు అద్దాలు ధ్వంసం

  • ఉప్పాల రాంప్రసాద్, జోగి రమేశ్ వర్గీయుల మధ్య ఘర్షణ

  • తోపులాట.. ఉప్పాల వర్గ కార్యకర్తలకు గాయాలు 

Ysrcp, Uppala ramprasad, Jogi ramesh, two division workers, fight themselves, Pedanaకృష్ణా: కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఉప్పాల రాంప్రసాద్ వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. పెడన బస్టాండ్ వద్ద బాలసౌరీ ర్యాలీలో ఇరువర్గాలు బాహాబాహికి దిగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పెడన బస్టాండ్‌ సమీపంలో ఇరువర్గాల ర్యాలీలు ఎదురవడంతో రెండు వర్గాల కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది.

ఈ క్రమంలో జోగి రమేశ్‌కు చెందిన కారు అద్దం ధ్వంసమయ్యాయి. ఉప్పాల వర్గానికి చెందిన ఇద్దరు కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది. మచిలీపట్నంలో పార్లమెంటరీ నియోజకవర్గ వైసీపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెడనలో జోగి రమేశ్‌, ఉప్పాల రాంప్రసాద్‌ వర్గాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు వేర్వేరుగా ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. 

English Title
Ysrcp two division workers fight themselves in Pedana
Related News