కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు!

Updated By ManamThu, 07/12/2018 - 14:55
YSRCP Leader criticized State and Central Govt Over Polavaram Project

YSRCP Leader criticized State and Central Govt Over Polavaram Project

హైదరాబాద్: వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం మధ్యాహ్నం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. పోలవరాన్ని వదిలేసి పట్టిసీమకు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్లలో బడ్జెట్‌ కేటాయింపులు నామమాత్రంగానే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీకి, టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కేంద్రం నిర్మించాల్సిన పోలవరాన్ని ఏపీ సీఎం చంద్రబాబు తన స్వార్థం కోసం తీసుకున్నారని బొత్సా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీఆర్‌లో ఎందుకు వ్యత్యాసాలు వచ్చాయో చెప్పాలని ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.

భూసేకరణ, నిర్మాణ వ్యయం ఎందుకు పెరిగిందో..? చెప్పాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఇవాళ కొత్తగా ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందని ఆయన వివమర్శలు గుప్పించారు. పోలవరాన్ని నిర్మించే చిత్తశుద్ధి ఉందా..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బొత్స ప్రశ్నించారు. పదే పదే పోలవరం ప్రాజెక్టు అంచనాలు ఎందుకు మారుస్తున్నారో చెప్పాలి. గడ్కరీ పోలవరం పర్యటనతో చంద్రబాబు భయంభయంగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్‌లా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు" అని బొత్స చెప్పుకొచ్చారు. 

కాగా.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ.. బుధవారం సాయంత్రం సీఎం చంద్రబాబుతో కలిసి పోలవరం పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన, అనంతరం మీడియాతో ఇరువురు మాట్లాడిన వ్యాఖ్యలపై బొత్సా సత్యనారాయణ కౌంటరిచ్చారు. అయితే ఈయన వ్యాఖ్యలకు టీడీపీ, బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

English Title
YSRCP Leader Botsa criticized State and Central Govt Over Polavaram Project
Related News