ఖాకీ చొక్కా తొడిగి.. ఆటో నడిపిన వైఎస్ జగన్

Updated By ManamWed, 05/16/2018 - 19:41
YS Jagan Reddy Wears Khaki And Drives Auto In Praja Sankalpa Yatra

YS Jaganmohan Reddy Drives Auto in Prejasankalpa Yatra

ఏలూరు : వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు రోజురోజుకు ప్రజాధరణ పెరుగుతోంది. పాదయాత్ర చేస్తున్నంత సేపూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. కాగా.. ఈ నెల 14న ఏలూరులో బహిరంగ సభలో.. వైసీపీ అధికారంలోకి రాగానే ఆటో కొనుగోలు చేసేవారికి పదివేల రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తుందని డ్రైవర్లకు జగన్ హామీ ఇచ్చిన విషయం విదితమే. ఈ ప్రకటనపై ఆటో యూనియన్, డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాదు మా డ్రైవర్ల మద్దతు వైసీపీకే ఉంటుందని స్పష్టం చేశారు.

అయితే పాదయాత్రలో భాగంగా బుధవారం రోజు ఆటో డ్రైవర్లను జగన్ కలిశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం మేదినరావు పాలెం వద్ద వైఎస్‌ జగన్‌ ఆటో యూనిఫాం ధరించి ఆటో నడిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మేదినరావుపాలెం క్రాస్ దగ్గర జగన్ ఆటో ఎక్కారు. దీంతో ఆటో  డ్రైవర్లు ఆనందంతో పొంగిపోయారు. మరోవైపు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఒక్క ఆటో డ్రైవర్లకే కాకుండా వైసీపీ అధికారలోకి వస్తే అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

జగన్ నడిపిన ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.." అవును.. ఆయన అందరివాడు. ప్రతి ఒక్క వృత్తిదారుడికి.. ప్రతి  ఒక్క సామాజిక వర్గానికి అండగా ఉండే అన్నలా హామీలు ఇస్తున్నారు. సొంత ఆటో ఉన్న ప్రతి  ఒక్కరికీ.. ఏడాదికి 10వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆటోవాళ్లకు అండగా ఉంటానని చెప్పారు. దీంతో మా ఆటోవాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వైఎస్ జగన్‌‌ను తమ గుండెలాంటి ఆటో ఎక్కి మాలో సంతోషాన్ని నింపారు" అని ఆటో డ్రైవర్ మీడియాకు చెబుతూ పట్టలేని ఆనందంతో పొంగిపోయాడు.

English Title
YS Jagan Reddy Wears Khaki And Drives Auto In Praja Sankalpa Yatra
Related News