కాలిబాటన తిరుమలకు జగన్

YS Jagan mohan reddy reached tirumala on foot

తిరుమల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల చేరుకున్నారు. అలిపిరి నుంచి ఆయన కాలిబాటలో తిరుమలకు వచ్చారు. ఆయన వెంట అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైఎస్ జగన్ మరికొద్దిసేపట్లో స్వామివారి దర్శనం చేసుకోనున్నారు. రాత్రి తిరుమలలో బసచేసి శుక్రవారం ఉదయం తిరుమల నుంచి బయలుదేరి కడప మీదుగా పులివెందులకు వెళతారు.

అంతకు ముందు పద్మావతి అతిథిగృహానికి వచ్చిన వైఎస్ జగన్‌కు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. కాగా ప్రజాసంకల్పయాత్రతో పేరుతో జగన్  ఏడాదికిపైగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసిన విషయం విదితమే.  ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన యాత్రను ఆయన శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద నిన్న ముగించారు.

సంబంధిత వార్తలు