315వ రోజు మొదలైన జగన్ పాదయాత్ర

YS Jagan Mohan Reddy

శ్రీకాకుళం: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 315వ రోజు ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు జగన్. అక్కడి నుంచి ఎస్.ఎం పురం, కేశవరావు పేట, లక్ష్ముడి పేట, నవభారత్ నగర్ మీదుగా ఫరీదుపేట వరకు ఇవాళ పాదయాత్రను కొనసాగించనున్నారు. ఇక ఇప్పటివరకు జగన్ 3,400.7కిలోమీటర్లు నడిచారు. కాగా పాదయాత్రలో భాగంగా ప్రజలలో మమేకమౌతున్న జగన్.. వారి సమస్యలను వింటున్నారు.

సంబంధిత వార్తలు