జగన్ సీఎం అవ్వడం ఖాయం..!

Updated By ManamThu, 07/12/2018 - 15:19
YS Jagan Becomes CM In Upcoming Elections Said Serial Artist Krishna Kishore

YS Jagan Becomes CM In Upcoming Elections Said Serial Artist Krishna Kishore

తూర్పు గోదావరి: వైెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల సినిమాటోగ్రఫర్‌ చోటా కే నాయుడు వైఎస్‌ జగన్‌ను కలిసి మద్దతు ప్రకటించగా తాజాగా.. సీరియల్‌ ఆర్టిస్టు కృష్ణ కిశోర్‌ కలిశారు.

గురువారం అనపర్తి నియోజకవర్గంలోని ఉలపల్లె వద్ద ఆయన.. జగన్‌తో కలిసి కొంత దూరం నడిచి తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణ కిశోర్‌ మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ ప్రజల కోసం పడుతున్న కష్టం కళ్లకు కట్టినట్లు కనిపించిందన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఆయన పాదయాత్ర చేస్తున్నారన్నారు. జగన్‌ వల్లే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. జననేత మాములు నాయకుడు కాదని, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తారని, ఇచ్చిన మాట తప్పడన్నారు. 

వైఎస్‌ జగన్‌ వేస్తున్న ప్రతి అడుగు ప్రజల కోసమే అని చెప్పారు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడం ఖాయమని, జగనన్న సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. జనాలందరూ వైఎస్‌ జగన్‌ రావాలని కోరుతున్నారని చెప్పారు. ప్రజల కోసం తాను చేయాల్సిందంతా చేస్తారని పేర్కొన్నారు.

జగనన్న మీద ఉన్న అభిమానం గుండెల్లో నిలిచిపోయిందని, వైఎస్‌ జగన్‌ ఎంత దూరం పాదయాత్ర చేసినా ఆయన వెంట జనాలు ఉంటారని తెలిపారు. 2019 మనదే అని, ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

English Title
YS Jagan Becomes CM In Upcoming Elections Said Serial Artist Krishna Kishore
Related News