యువజనం-నవపథం..!

Youth

నేటితరం యువత ఆత్మ విశ్వా సంతో కార్యోన్ముఖులైతే సింహం వలె సమస్యలను పరిష్కరించ గలరు. తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరిగి నూతన ప్రభుత్వం కొలువు దీరింది. ఆ వెను వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఆ తర్వాత జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరగ నున్నాయి. తెలంగాణ ప్రజలకు 2019 ఎన్నికల నామ సంవత్సరం గానుంది. తొలి స్వతంత్ర పోరాటాల నుండి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత తొలి, మలి తెలంగాణ సాధన పోరులో ప్రజలు కీలక భూమిక పోషించి అటు స్వాతంత్య్ర సాధనలో ఇటు తెలంగాణ సాధన లోనూ కృతకృత్యులై, విజయాన్ని సాధించి నారు. నేడు పంచా యితీ ఎన్నికల కోలాహలం కొనసాగు తున్న వేళ.. పంచా యితీ నుండి పార్లమెంట్ దాకా, యువతీ యువత రాజకీ యాల్లో ప్రవేశించి నిస్వార్థంగా సేవాగుణం తో రాజకీయాలను ప్రక్షాళన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. భారత దేశంలో ప్రపంచంలోని దేశాల కన్నా ఎ క్కువ యువజనాభా గల దేశంగా గణాంకాలు తెలియ జేస్తున్నాయి. అధిక జనశక్తి తోడుగా యువజన శక్తిని సక్ర మంగా ఉపయోగించలేని కారణంగా మనం వెనుకబడి పోతున్నాము. నేటి యువత పంచాయితి నుండి పార్లమెంట్ దాకా రాజకీయాల్లోకి వచ్చి అవినీతి, బంధుప్రీతి కుంభకోణా లను రూపుమాపి రాష్ట్ర, దేశచరిత్రలో నూతన అధ్యాయానికి నాంది పలకాల్సి ఉందని మేధావులు, ప్రజలు భావిస్తు న్నారు. ఎవరు ఎక్కడికి పోతే నాకేందిలే నేను నా కుటుంబం బాగుంటే చాలుననే విధానాలకు చరమగీతం పాడాలి. నాడు దేశ స్వతంత్ర పోరులో ప్రాణాలను తృణప్రాయంగా, మొన్న తెలంగాణ సాధనలో అమరులైన వారి త్యాగాలను వృథా కానీయరాదు. వారి నుండి నేటి యువత స్ఫూర్తిని పొంది భావితరాల భవిష్యత్ బాగుపడేలా పాలనలో భాగస్వామ్యులు కావాలి. నేటి యువత అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుని, తన బాధ్యతను, కర్తవ్యాన్ని చిత్త శుద్ధితో నిర్వహించి గ్రామం నుండి దేశం వరకు అభివృద్ధి పథంలో నడిపేలా ప్రణాళికల రూపకల్పన నుండి ప్రగతి ఫలాలు క్షేత్రస్థాయిలోని ప్రజలకు అందేలా పాలనలో వైవి ధ్యాన్ని, నూతన వైఖరులను, వినూత్న పాలన అందిస్తూ మానవీయ కోణం వెల్లివిరియాల్సి ఉందని గమనించండి. ‘అంగట్లో అన్ని ఉండి అల్లుని నోట్లో శని ఉందన్నట్లు’ యువతను సరైన మార్గదర్శకం చేయలేని విధానాల వలన యూత్(మ్యాన్) పవర్ నిరుపయోగంగా మారి సమాజంలో అశాంతికి కారకులౌతారని గత అనుభవాలు తెలుపుతు న్నాయి. యువతరం పొంగిపొర్లే నదిలాంటిది. ఊరకే వదిలితే ఉప్పు సముద్రం పాలేనని, పాలకులు గమనించాలి, యువత మేల్కొనాలి.

యువజనోత్సవాలు ప్రతి సంవత్సరం వస్తున్నాయి, పోతున్నాయి. కానీ పాలకులు ఆ రోజు కొన్ని యువతకు సంబంధించిన పథకాలు, కార్యక్రమాలు తూతూ మంత్రం గా చేస్తూ ప్రచారంలో ఆర్భాటాలే తప్ప, యువత జీవితంలో ఆశించిన స్థాయి ప్రగతి సాధించిన దాలాలు లేవు. ‘నేతి బీరలో నెయ్యి’ చందంగా మారిందనేది వాస్తవం కాదా! యువతలో నైపుణ్యం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగి నిరుద్యోగ భూతం తరమ బడాలన్నా, ఈ సమాజం తక్షణ పురోగతి సాధించాలన్నా యువజనాభా ఎక్కువగా గల సమాజంలో యువత పాలనా పగ్గాలు చేపట్టాలి. సగటు భారతీయుడి బతుకు బాగుపడాలన్న స్వామి వివేకానందుడి లోని స్ఫూర్తిని వజ్రసంకల్పంగా పాలన చేబూనాలి, అభి వృద్ధి పథంలో నడిపించాలి. సుభాష్ చంద్రబోస్, భగత్‌సింగ్ లాంటి ఎందరో తొలి స్వతంత్ర సమరయోధుల నుండి తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య, మొన్నటి శ్రీకాంతాచారి వరకు ఇంకెందరో యువకులు ఆత్మ లిదానాలు చేసుకున్న విషయం నేటి యువత వారి త్యాగా లను నేటి ప్రజలు, యువ సమాజం మరువరాదు. ఈ 2019 ఎన్నికల నామ సంవత్సరంలో పంచాయితీ నుండి పార్లమెంటు దాకా అన్ని రకాల పాలనా వ్యవస్థల్లో రాజకీయ ప్రవేశం, యువత భాగస్వామ్యం పెరగాలి. అలా పాలనా పగ్గాలు చేపట్టిన యువత పంచాయతి నుండి పార్లమెంట్ వరకు పాలనలో, ప్రణాళికల్లో యువత మార్కు (ప్రాతిపదిక, ప్రతిపత్తి) కనిపించాలి, అభివృద్ధి వైపు అడుగులు పడాలి. యువత జనోత్సవానికి 2019 ఎన్నికల నామా సంవ త్సరానికి రాజకీయ ప్రవేశం చేయడం, కీలక బాధ్యతల్లో ఉండి సమర్థవంతమైన పాలన అందివ్వడమే మిరిచ్చే 2019 యువజనోత్సవానికి నిజమైన అర్థం అని గమనించండి. శ్రీ శ్రీ చెప్పినట్లు కొంతమంది యువకులు పుట్టకతో వృద్ధులు అనే అపవాదుతో పాటు వ్యవసనాల నుండి యువత బయటపడి తమ సత్తాను, సత్తువను చూపుతూ నేటి సమా జానికి చాటింపువేసి చాటి చెప్పాలి. వారసత్వపాలన, కుటుంబ పాలన లాంటి వాటికి స్వస్థి పలకాలి. ‘ఇండ్లు కాలునపుడు  బావి తవ్వించినట్లు’గా గత బూజు విధానాల బూజు దులుపాలి యువలోకం. నవలోకానికి నాంది పలకాలి. గత చరిత్ర చదవడంతో పాటు భావితరానికి చరిత్ర సృష్టించాలి. భారత ప్రజాస్వామ్య పార్టీ విధానంలో పార్టీలన్నీ యువతకు సముచిత స్థాయిలో రాజకీయ ప్రవేశానికి స్థానం కల్పించాలి. ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ వైఖరులను మేధస్సునిండా నింపుకున్న యువత సానుభూతి పొంగిపొర్లిస్తూ సమసమా నిర్మాణానికి సేవకులుగా మారం డి. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా 60 శాతం యువ జనాభా గల దేశంగా రాబోవు కాలంలో భారత్ అగ్రభాగాన నిలుస్తుందని మనవైపు ప్రపంచం చూస్తోంది. ఇలాంటి వేళ.. భారత్ యువత కరిగిపోయే యువ ప్రాయాన్ని సద్వినియోగ పరుచుకోవాలి. జాతి జనుల కోసం, భారతదేశం కోసం బంగారంలోని ప్రతి అణువు ఎంత విలువైందో.. గడిచే కాలంలోని ఒక్కొక్క ఘడియ అంతకన్నా విలువైందని తెలుసుకొని పాలకులు, ప్రజలు, యువత మసులుకోవాలి. గతమంతా ‘చేతులు కాలక ఆకులు పట్టుకున్నట్లు’గా గడిచిందని గమనించండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం పదవులకు రిజిర్వేషన్ కల్పించినట్లు బీరాలు పలికేవారు చట్టసభల్లో ఎందుకు స్థానం కల్పించలేకపోతున్నారని, మహిళా బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం ఎందుకు లభించడం లేదని మహిళా సమాజం భావిస్తుంది.

ప్రపంచ యువతకు మార్గనిర్దేశకుడిగా నిలిచిన స్వామి వివేకానందుని జయంతి (జనవరి 12)ని పురస్కరించుకొని దేశ భవితకోసం యువతరం సృజనశీల ఆలోచనలతో ముందుకు వెళ్ళేందుకు యువజనం నవపథంలో కుళ్లు రాజ కీయాలు, అవినీతి రాజకీయాలు అంటూ శాపనార్థాలు మానాలి. పాలనా పగ్గాలు చేబూని దేశాన్ని నవపథం వైపు నడిపించాలి. దేశంలోని జాతి సంపద కొద్దిమంది (కుటుం బాల) చేతుల్లోకి వెళ్ళకుండా నిలువరించాలి. చీమలు నిర్మించుకున్న పుట్ట పాములపాలైనట్లు 50 శాతం జనా భాగల యువత పాలకులై ప్రజలకు జాతి సంపదను, ప్రగతి ఫలాలను సమంగా పంచే రోజు రావాలి. నేటి ఆధునిక విద్యాలయాల్లో విద్యార్థులకు మానవతా విలువలు బోధించకపోవడం వలన, యువప్రాయంలోనే వారు వ్యసనాలకు బానిసలౌతున్నారు. జన్మనెత్తిన క్షణం నుంచి జన్మనిచ్చే స్థాయికి చేరి కేవలం తన జన్మేకాక ఇతరుల జన్మ సార్థకత చేకూర్చ వలసిన ప్రక్రియలో ఈ నాటి యువత నిర్లక్ష్యంతో పెడదోవపడుతోంది.
మేకిరి దామోదర్
9573666650
(రేపు జాతీయ యువజన దినోత్సవం)

Tags

సంబంధిత వార్తలు