ఎల్లో ఆర్మీ తెలంగాణ యాప్ రిలీజ్

Updated By ManamSun, 10/14/2018 - 12:19
LAUNCH OF YELLOW ARMY TELANGANA MOBILE APP
 YELLOW ARMY TELANGANA MOBILE APP LAUNCHED BY L.RAMANA

హైదరాబాద్ : ఎల్లో ఆర్మీ తెలంగాణ యాప్‌ను తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రమణ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన ఆదివారం ఈ యాప్‌ను రిలీజ్ చేశారు. మరో నెల రోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీ.టీడీపీ ఈ యాప్‌ను విడుదల చేసింది.

ఈ యాప్ ద్వారా ప్రజలకు చేరువ కానుంది. ఈ సందర్భంగా ఎల్. రమణ మాట్లాడుతూ..ఎన్నికల విజయశంఖారావం పూరించడానికి కార్యకర్తలందరూ ఎన్నికల్లో మహాకూటమి కోసం ఏకతాటిపై పని చేసేందుకు ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

English Title
Yellow army telangana moblie app released by L.Ramana
Related News