సెట్స్‌పైకి ‘యాత్ర’

Updated By ManamWed, 06/20/2018 - 15:08
yatra
yatra

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. కాగా ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకున్న ఈ చిత్రం బుధవారం నుంచి సెట్స్ మీదకు వెళ్లింది. 

సెప్టెంబర్ వరకు ఈ చిత్ర మొదటి షెడ్యూల్‌ను నిర్వహించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ చిత్రంలో విజయమ్మ పాత్రలో బాహుబలి ఫేం అశ్రిత నటించగా, సబితా ఇంద్రారెడ్డిగా సుహాసిని, షర్మిలగా భూమిక నటించనుంది. 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

English Title
Yatra on sets from today
Related News