ఎవరి గెలుపు కోసం పవన్ పోటీ చేస్తున్నారో..?

Updated By ManamTue, 10/16/2018 - 10:47
Pawan Kalyan, Yanamala Ramakrishnudu

Pawan Kalyan, Yanamala Ramakrishnuduఅమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌వి లాలూచీ రాజకీయాలని.. ఎవరి గెలుపు కోసం పవన్ పోటీ చేస్తున్నారో చెప్పాలని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. జగన్‌పై కోపం లేదంటూనే, అతడి అవినీతి దేవుడికి తెలుసని పవన్ మాట్లాడటం హాస్యాస్పదమని యనమల ఎద్దేవా చేశారు. సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లలో జగన్ అవినీతి తెలీదా అంటూ ప్రశ్నించారు.

జగన్, మోదీని వదిలేసి పవన్ చంద్రబాబుపై ఆరోపణలు చేస్తున్నారని, రాఫెల్ స్కాంపై పవన్ ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ముఖ్యమంత్రి కావాలంటే అందరివాడై ఉండాలని, చంద్రబాబు అందరివాడు కాబట్టే 14ఏళ్లు సీఎం కాగలిగారు అని చెప్పారు. చిరంజీవి అందరివాడు అనే సినిమాను తీసినా.. నిజ జీవితంలో కొందరి వాడిలాగే మిగిలిపోయారని.. పవన్ ప్రచారం చేసిన పాలకొల్లులోనూ చిరంజీవి ఓడిపోయారని గుర్తు చేశారు. ఎన్నికల తరువాత జనసేన ఎవరితో కలిసిపోతుందో పవన్ చెప్పాలని యనమల రామకృష్ణుడు అన్నారు. కాగా సోమవారం రాజమహేంద్రవరంలో జనసేన కవాతు సందర్భంగా ప్రసగించిన పవన్.. టీడీపీపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. 

English Title
Yanamala Ramakrishnudu fire on Pawan Kalyan
Related News