యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూత

Updated By ManamMon, 05/21/2018 - 09:47
Yaddanapudi Sulochana Rani, popular Telugu novelist

Yaddanapudi Sulochana Rani, popular Telugu novelist కాలిఫోర్నియా: ప్రముఖ తెలుగు నవల రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి (78) కన్నుమూశారు. కాలిఫోర్నియాలో తన కుమార్తె ఇంట్లో ఆమె గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సులోచనారాణి కుమార్తె శైలజ ధ్రువీకరించారు. సులోచనారాణి అంత్యక్రియలు కాలిఫోర్నియాలోనే నిర్వహించనున్నారు. పలు ప్రఖ్యాత నవలలు రచించిన సులోచనారాణి నవలల ఆధారంగా ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ఆంధ్రప్రదేశ్‌లోని క్రిష్ణా జిల్లా (కాజా)లో జన్మించిన సులోచనా రాణి.. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో తనదైన శైలిలో ఎన్నో అద్భుతమైన నవలలు రాశారు. యద్దనపూడి సులోచనారాణి 1940లో కృష్ణాజిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించారు. తను పరిశీలించిన జీవితాలను వస్తువులుగా తీసుకొని మొదట రచనలు చేయడం ప్రారంభించారు. సులోచనారాణి ఎక్కువ ప్రేమ కథలనే రాశారు.

సులోచనారాణి తొలిసారిగా చదువుకున్న ‘అమ్మాయిలు’ చిత్రం ద్వారా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 1965లో ‘మనుషులు - మమతలు’ సినిమాకు కథను అందించారు. తర్వాత ఆమె రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, చండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. అయితే సెక్రటరీ మాత్రం ఓ లెజండ్‌గా మిగిలిపోయింది. మీనా నవల పత్రికలో ధారావాహికగా వచ్చింది. పేరును పాఠకులే నిర్ణయించారు. చివరకు ‘మీనా’ నవలను 1973లో విజయనిర్మల దర్శకత్వం వహించి అదే పేరుతో ‘మీనా’ చిత్రంగా తెరకెక్కించారు. 

English Title
Yaddanapudi Sulochana Rani passes away
Related News