ఒమన్‌లో బీభత్సం.. ఐదుగురి మృతి

Updated By ManamSun, 05/27/2018 - 01:11
oman cyclone
  • మెర్కును తుపాన్ ముప్పు

  • గోవా వైపు తుపాన్ పయనం: ఐఎండీ

omanసలాలాహ్: పెను తుపాను మెర్కును ధాటికి ఒమన్ దేశం విలవిలలాడుతోంది. యెమెన్‌లోనూ ప్రతాపం చూపుతోంది. భీకరమైన గాలులలకు తోడు.. కుంభవృష్టిగా వర్షం పడుతుండటంతో ఒమన్ తీర ప్రాంతమై నగరమైన సలాలాస్‌లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. అనేక చోట్ల రహదారులు తెగిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. వివిధ ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. 30 మంది గల్లంతయ్యారు. మరోవైపు, ఈ తుపాన్ గోవావైపు దూసుకొస్తోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు 3 నుంచి మూడున్నర మీటర్ల ఎత్తులో అలలు తీరంపై విరుచుకుపడతాయని హెచ్చరించింది. మస్కట్‌లోని సలాల రీజియన్ సమీపంలో గల అరేబియా సము ద్రంలో గురువారం రాత్రి మెకును తుపాను సంభవించింది. ఈ వాతావరణంలో మార్పులు అత్యంత ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో మత్య్సకారులు చేపల వేటకు వెళ్లకూడదని తెలిపింది.

English Title
Wreaking havoc in Oman
Related News