‘డార్క్ చాక్లెట్‌’ తింటున్నారా?

Updated By ManamSat, 07/07/2018 - 13:47
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolate
  • నేడు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం

World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateవెబ్ ప్రత్యేకం: డార్క్ చాక్లెట్.. అనగానే నోటిలో లాలాజలం ఇట్టే ఊరిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్లవరకు అందరూ ఈ చాక్లెట్లను ఎంతో ఇష్టపడతారు. పళ్లులేని ముసలివాళ్లు కూడా మొత్తని చాక్లెట్‌ను చూస్తే ఫిదా అయిపోతారనడంలో సందేహం లేదు. ఈ రోజు ప్రపంచ చాక్లెట్ దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవంగా జరుపుకుంటారు. యూరప్‌లో 1550, జూలై 7నుంచి చాక్లెట్ దినోత్సవాన్ని ప్రారంభించగా, అప్పటినుంచి ఎంతో మధురమైన ఈ రోజును వివిధ దేశాల్లో ప్రత్యేకంగా తమకు ఇష్టమైన చాక్లెట్లను తింటూ తియ్యదనాన్ని ఆశ్వాదిస్తుంటారు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల ఎన్నో ఆర్యోగకర ప్రయోజనాలు ఉన్నాయి. ప్రత్యేకించి బ్రౌన్ చాక్లెట్‌ తింటే ఆరోగ్యానికి చాలా మంచింది. బ్రౌన్ కలర్ చాక్లెట్‌లో మంచి రుచితో పాటు ఎన్నో విలువైన పోషకాలు దాగి వున్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. మన శరీరానికి కావాలిసిన పోషకాలను వివిధ మార్గాల్లో డార్క్ చాక్లెట్ ద్వారా లభిస్తుంది. కోకో అనే ఒక తరహా చెట్ల నుంచి కాయలను చాక్లెట్ తయారీకి వాడుతారు. దీనికి చాకొలేటు వృక్షమని పేరు కూడా ఉంది. డార్క్ చాక్లెట్లలో కోకో శాతం అధిక సాంద్రతలో ఉంటుంది.

రుచికి రుచి.. తీపికి తియ్యదనం..
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateఆహా.. చాక్లెట్‌ను తింటున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణాతీతం. వీటిలో ముఖ్యంగా డార్క్ చాక్లెట్ ఒకటి. వైట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్.. ఇలా ఎన్ని ఫ్లేవర్లలో లభించినా చాక్లెట్ మాధుర్యంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ మేరకు ది జనరల్ ఆఫ్ న్యూట్రిషియన్‌లో ఒక పరిశోధనను ప్రచురించారు. ‘‘చాలా ఏళ్లుగా డార్క్ చాక్లెట్‌‌పై ఎన్నో పరిశోధనలు చేస్తున్నాం. అధిక మొత్తంలో షుగర్‌తో మిళితమైన ఈ చాక్లెట్‌ తిన్నవారిలో నాడీ సంబంధ విధులపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా వారిలో ఒత్తిడి దూరమై సంతోషం కలుగుతుంది’’ అని కాలిఫోర్నియాలోని లోమా లిండా యూనివర్శిటీ నుంచి పరిశోధకులు లీ ఎస్ బెర్క్ పేర్కొన్నారు. 

డార్క్ చాక్లెట్‌తో అద్భుత ప్రయోజనాలెన్నో.. 
డార్క్ చాక్లెట్ తిన్నవారిలో ఒత్తిడి తగ్గుతుంది. తాపాన్ని చల్లారుస్తుంది. అంతేకాదు.. మెదడు మెమెరీ‌తో పాటు వ్యాధినిరోధక శక్తి, మూడ్‌ను కూడా మెరుగుపర్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పరిశోధకుల పరిశోధనల ప్రకారం.. కోకోలో లభించే శక్తివంతమైన అనామ్లజనకాలు, తాపజనక కారకాలు అధిక మోతాదులో ఉంటాయి. ముఖ్యంగా మెదడు, గుండె సంబంధిత సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. డార్క్ చాక్లెట్లను తింటే కలిగే అద్భుతమైన ఐదు ఆరోగ్యకర ప్రయోజనాలు ఏమిటో ఓసారి చూద్దాం.. 

గుండె ఆరోగ్యానికి.. 
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateడార్క్ చాక్లెట్‌ను తిన్నవారిలో ముఖ్యంగా లో-డెన్సిటీ లిపోప్రొటీన్ (ఎల్‌డీఎల్) కొవ్వు, ప్రోటీన్ల స్థాయిని తగ్గించడంలో సాయపడుతుందని ఒక పరిశోదనలో వెల్లడైంది. ఈ పరిశోధనలో డార్క్ చాక్లెట్ బార్‌లో ఉండే కోకో ఫ్లావినోల్స్ (సీఎఫ్), ప్లాంట్ స్టేరాల్స్ (పీఎస్) గుండె సంబంధిత సమస్యలకు కారణమయ్యే కొవ్వు స్థాయిలను తగ్గించి రక్తప్రసరణను మెరుగుపర్చి గుండె ఆరోగ్యానికి తోడ్పడుతాయి. ఎల్‌డీఎల్ ఆక్సిడేషన్ నుంచి అత్యంత రక్షణకారిగా ఈ డార్క్ చాక్లెట్ పనిచేస్తుంది.

మానసిక స్థితి (మూడ్)లో మెరుగు..
డార్క్ చాక్లెట్‌లో అధిక మొత్తంలో ఉండే కోకో ఫ్లావినోల్స్ వల్ల మనిషి మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు దోహదపడుతాయి. స్విట్జర్లాండ్‌లోని నెస్లే రీసెర్చ్ సెంటర్‌లో ఒక పరిశోధన నిర్వహించారు. అందులో భాగంగా కొందరికి ప్రతిరోజు రెండు వారాల చొప్పున 1.4 ఔన్సుల డార్క్ చాక్లెట్లను ఇస్తూ వచ్చారు. అలా చాక్లెట్ తిన్నవారిలో కార్టిసాల్ సహా ఒత్తిడిని కలిగించే హార్మోన్లు తీవ్రతను తగ్గించినట్టు గుర్తించారు. 

డయాబెటిస్‌కు చెక్..
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateడార్క్ చాక్లెట్‌లో లభించే కోకో సమ్మేళనమైన ఎపికాటెక్సిన్ మోనోమర్ల సాయంతో శరీరంలో అధికశాతంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తాయని ఓ పరిశోధన వెల్లడించింది. అంతేకాక రక్తంలోని గ్లూకోజ్‌ను మంచి స్థాయిలో పెరిగేలా చేస్తుంది. దీనిబట్టి చూస్తే దీర్ఘకాలం బాధించే డయాబెటిస్‌ను సైతం డార్క్ చాక్లెట్‌తో చెక్ పెట్టేయవచ్చు.. 

వృద్ధాప్యంలో మెదడుకు రక్షణ..
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateవృద్ధాప్యంలో ఎదురయ్యే మతిమరుపు వంటి సమస్యల్లో ముఖ్యంగా ఒత్తిడి వల్ల మెదడులో కలిగే దుష్ప్రభవాలను తగ్గిస్తుంది. ఒత్తిడి కారణమయ్యే ఆక్సిడేటివ్స్, న్యూరోన్ ఫ్లోమజేషన్ వల్ల మెదడు దెబ్బతినకుండా డార్క్ చాక్లెట్‌లోని కోకో ఫ్లావినల్ రక్షణగా నిలుస్తాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే అల్జిమర్స్ వ్యాధి (మతిమరుపు) వంటి సమస్యలను అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మానసిక బలహీనతతో బాధపడే పెద్దవారిలో డార్క్ చాక్లెట్ తింటే అందులోని కోకో వారిలోని మేధో వికాసాన్ని పెంచడంలో సాయపడుతుంది. 

చర్మానికి ఎంతో మేలు.. 
World Chocolate Day 2018, Healthy heart, better mood, health benefits, eating dark chocolateచర్మం ఆరోగ్యానికి డార్క్ చాక్లెట్‌లోని కోకో ఫ్లావినోల్స్ రక్షణగా నిలుస్తాయని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. కోకో శాతం అధికంగా ఉండే డార్క్ చాక్లెట్‌ను తిన్నవారిలో చర్మంపై రక్తప్రసరణ మెరుగుపడటమే కాకుండా సూర్యరశ్మి సోకిన చోట తేమ కోల్పోయి నిర్జీవంగా మారిన చర్మాన్ని రక్షిస్తుంది. ఫలితంగా కోమలమైన చర్మం సొంతం అవుతుంది.

English Title
World Chocolate Day 2018: Healthy heart, better mood & other health benefits of eating dark chocolate




Related News