‘కన్నుగీటు’ సుందరి కోటి కొట్టేసింది..!

Updated By ManamTue, 07/10/2018 - 23:55
Winking Priya Varrier
  • ప్రియా వారియర్‌కు కోటి ఆఫర్..!

Winking Priya Varrier, signs One crore deal, first commercialఒక కన్నుగీటుతో కుర్రాళ్లను కునుకు లేకుండా చేసి ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మలయాళ నటి ప్రియా వారియర్‌ భారీ ఆఫర్ పట్టేశారు. ‘ఒరు అదార్‌ లవ్‌’ చిత్రంలోని ఓ పాటలో వారియర్ పలికించిన హావభావాలు కుర్రకారును పిచ్చెక్కించాయి. అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేసిన ప్రియా వారియర్‌కు పాపులారిటీ పెరగడంతో ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చిపడుతున్నాయి. తాజాగా ఓ యాడ్ కంపెనీ వారియర్‌కు రూ. కోటి ఆఫర్‌ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ జాతీయ వాణిజ్య ప్రకటన సంస్థ ఆమెతో భారీ డీల్‌ కుదుర్చుకోగా, దానికి ప్రియా కూడా సంతకం చేసినట్లు తెలుస్తోంది. పెద్ద స్టార్ హీరోయిన్ల కంటే ఇదే భారీ పారితోషికమని టాక్ వినిపిస్తోంది.

ఈ ప్రకటన చిత్రీకరణకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ నుంచి ఏదైనా ఒక ప్రకటనను ప్రమోట్‌ చేయాలంటే ప్రియ రూ.8 లక్షలు తీసుకుంటున్నారు. ఆమెకు తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో దాదాపు 62 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. కాగా, రోహిత్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ‘సింబా’ చిత్రంలో కూడా ప్రియా వారియర్ లీడ్ రూల్ పోషిస్తున్నట్లు సమాచారం.  

English Title
Winking sensation Priya Varrier signs One crore deal for her first commercial
Related News