కేసీఆర్‌ను విమర్శిస్తే పదవులిస్తరా?

Updated By ManamSat, 09/22/2018 - 02:14
komati
  • కొత్తోళ్ళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం సరికాదు

komatiహైదరాబాద్: ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శిస్తే  పదవులు ఇస్తారా? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ హైకమాండ్‌ను ప్రశ్నించారు. కాంగ్రెస్ అధిష్టానం, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి కుంతియాపై ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాల్సిందిగా టీపీసీసీ జారీ చేసిన షోకాజ్  నోటీసుకు ఆయన వెంటనే వివరణ ఇచ్చారు. సీనియర్లను పట్టించుకోకుండా కమిటీ వేశారనేది, తన ఆవేదనని, ఇది అర్దం చేసుకోవాలన్నారు. పార్టీ కోసం కష్ట పడే వారిని పక్కన పెట్టారని, షోకాజ్ నోటీసులు ఇవ్వడం కాదని, తన  సూచనలు సానుకూలంగా తీసుకోవాలన్నారు. కార్యకర్తల ఆవేదన వ్యక్తం చేశానని, తనకు  ఎలాంటి అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి తీసుకరావడానికి తమలాంటి నేతలను ఉపయోగించుకోవాలన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా కాంగ్రెస్ ఎందుకు  పుంజుకోలేదో టీపీసీసీ సమీక్షించుకోవాలని కోరారు. స్వార్ద ప్రయోజనాల కోసం కొందరు కమిటీల విషయంలో తమ అధినేత రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించారన్నారు. పార్టీ మారిన  సురేష్‌రెడ్డి పేరు కూడా  కమిటీలో ఉండటం చూసి ప్రజలు నవ్వుతున్నారని తెలిపారు. 70 ఏండ్లు నిండిన వాళ్లు కూడా పోటీ చేస్తామంటే ఎట్లా? అని ప్రశ్నించారు. పార్టీని గెలిపించే ఆలోచన చేయాలని కోరుతున్నానని, గాంధీభవన్‌లో కూర్చుని పార్టీ పదవులు అమ్ముకునేవారి కూడా తనకు షోకాజ్ నోటీసులు ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. తాను ఇప్పటికి కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలనుకుంటున్నానని, తనలాంటి వ్యక్తిని కోల్పోతే పార్టీకే నష్టమన్నారు.

రెండురోజుల్లో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి పిసిసి క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియాపై చేసిన వ్యాఖ్యల కు రెండురోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఎన్నికల్లో గెలుపే లక్ష ్యంగా పార్టీకి చెందిన ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ  కాంగ్రెస్ అధిష్టానం కమిటీలను ఏర్పాటు చేసింది. 9 అనుబంధ కమిటీలను ఏర్పాటు చేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌లను నియమించింది. అదే విధంగా 53మందితో  కో ఆర్డినేషన్ కమిటీ, 41మందితో ఎన్నికల కమిటీని నియమించిన విషయం విదితమే. అయితే ఈ కమిటీలపై రాజగోపాల్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో  తిరిగే బ్రోకర్లు, టీవీలు, పేపర్లలో మాట్లాడే వారికే కమిటీల్లో స్దానం కల్పించారని, కనీసం వార్డు మెంబర్లుగా గెలవని వారికి ప్రాధాన్యతనిచ్చారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ వేసిన కమిటీలన్నీ బ్రోకర్లతో నిండిపోయాయని ,కుంతియా రాష్టానికి  పట్టిన శని అంటూ విరుచుకపడ్డారు. కమిటీల ఏర్పాటుపై తాను కుంతియాను నిలదీసినట్లు తెలిపారు. వందమంది కుంతియాలు వచ్చినా కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాల వల్లే అధికారం కోల్పొయాం. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి ,జైలుకు వెళ్లి వచ్చిన వారికి కూడ పెద్ద పదవులు ఇచ్చారని, ప్రజానాయకులకు అన్యాయం జరిగిందని అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ ఆరోపణలను అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఆయనకు శుక్రవారం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు పార్టీ  పేర్కొంది.

English Title
Will you criticize KCR?
Related News