ఐశ్వర్యతో నటించాలనుంది

Updated By ManamSun, 10/07/2018 - 11:48
Will Smith, Aishwarya Rai

Will Smith, Aishwarya Raiమాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్యరాయ్‌తో కలిసి నటించాలనుందని ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్ అన్నాడు. ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన విల్‌స్మిత్ మాట్లాడుతూ., ఐశ్‌తో నటించాలనుందన్న విషయాన్ని బయటపెట్టారు. ‘‘పదిహేనేళ్ల క్రితమే ఐశ్వర్య రాయ్‌ను కలిశాను. మేం కలిసినప్పుడల్లా ఏదన్నా సినిమాలో నటించే విషయం గురించే మాట్లాడుకుంటాం. అయితే అది జరగలేదు. ఎప్పటికైనా ఆమెతో కలిసి నటిస్తా. అలాగే చనిపోయేలోపు ఓ బాలీవుడ్ పాటలో నటించాలని కూడా ఉంది’’ అంటూ విల్‌స్మిత్ చెప్పుకొచ్చారు.

ఇక ప్రస్తుతం బాక్సింగ్ చాంపియన్ మహమ్మద్ అలీ బయోపిక్‌లో విల్‌స్మిత్ నటిస్తుండగా దాని గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. అలీ రింగ్‌లో బాక్సింగ్ చేస్తున్నప్పుడు నేను ప్రేక్షకుల మధ్యలో కూర్చొని చూసేవాడని. అలాంటింది ఆయన పాత్రలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదు’’ అంటూ చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్‌ కూడా పాల్గొనగా విల్‌స్మిత్ చేత బాంగ్రా స్టెప్పులు వేయించారు.

English Title
Will Smith want to act with Aishwarya Rai
Related News