ప్రభాస్ ఇప్పుడైనా రివీల్ చేస్తాడా?

Updated By ManamTue, 10/23/2018 - 10:38
will Prabhas to make announce about wedding on his birthday
  • ప్రభాస్‌కు వెల్లువెత్తుతున్న పుట్టినరోజు శుభాకాంక్షలు

will Prabhas to make announce about wedding on his birthday

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇవాళ ‘సాహా’రే బాహుబలి జన్మదినోత్సవం కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ....‘డార్లింగ్’కు బర్త్‌డే విషెస్ చెబుతున్నారు. ‘సాహో’ టీమ్ ప్రభాస్‌కు శుభాకాంక్షలు తెలిపింది. అలాగే  ప్రముఖ హీరో వెంకటేష్, దర్శకుడు కొరటాల శివ, హీరో శ్రీవిష్ణుతో పాటు పలువురు విష్ చేశారు. ఇక 
ప్రభాస్‌కు... నటుడు బ్రహ్మాజీ ‘డబుల్ కామీఠా, రసగుల్లా, కాకినాడ కాజా, స్వీటెస్ట్ హార్ట్ డార్లింగ్’ అంటూ ట్వీట్ చేశాడు.

మరోవైపు ఫ్యాన్స్‌కు ప్రభాస్ తన పుట్టినరోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెబుతాడంటూ గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్‌గా ఉన్న రెబల్ స్టార్... ఈ బర్త్‌డేకి తన పెళ్లిపై అభిమానులకు క్లారిటీ ఇస్తాడంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ...ఆత్రుతగా పెళ్లివార్త కోసం ఎదురు చూస్తున్నారు. మరి అభిమానుల కోరిక ప్రభాస్ తీర్చుతాడా అంటే మరి కొద్ది సమయం వెయిట్ చేయాల్సిందే. ‘మనం’ తరఫున ప్రభాస్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే ప్రభాస్...

English Title
will Prabhas to make announce about wedding on his birthday
Related News