చంద్రబాబు చివరి ప్రయత్నం ఫలించేనా?

Updated By ManamSun, 07/15/2018 - 19:39
Will Chandrababu Success Final Attempt On Centre

Will Chandrababu Success Final Attempt On Centre

అమరావతి: ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు, నిధులు రాబట్టుకునే విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు మరో అడుగుముందుకేశారు. త్వరలో చివరి పార్లమెంట్ సమావేశాలు జరగనుండటంతో కేంద్రంపై ఆఖరి అస్త్రం వదిలేందుకు సీఎం సిద్ధమయ్యారు. మొదట జాతీయ స్థాయి పార్టీ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో టీడీపీ ఎంపీలు నిమగ్నమయ్యారు. ఇందుకు ఎంపీలతో కూడిన ఆరు బృందాలను చంద్రబాబు తయారుచేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ఎంపీలందరూ 18పార్టీల నేతలను కలవనున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలపై టీడీపీ పోరాటానికి మద్దతు కోరనున్నారు. చంద్రబాబు లేఖలను ఆయా పార్టీల నేతలకు ఎంపీలు అందజేయనున్నారు. 

టీఎంసీ, బీజేడీ, ఆప్, ఎస్ఏడీ నేతలను సుజనా చౌదరి, అవంతి శ్రీనివాస్, జేసీ, మాల్యాద్రి కలవనున్నారు. సీపీఎం, సీపీఐ, శివసేన, ఎన్సీపీ నేతలను తోట నర్సింహం, మాగంటిబాబు, రవీంద్రబాబు కలుస్తారు. డీఎంకే, ఏఐడీంకే, జేడీఎస్, ఎస్పీ, బీఎస్పీ నేతలను సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్, మురళీ మోహన్ కలవనున్నారు. జేడీయూ, ఆర్జేడీ, ఎల్జేపీ నేతలను గల్లా జయదేవ్, గరికపాటి మోహన్‌రావు, రవీంద్ర, టీఆర్ఎస్, ఎంఐఎం, కేరళ కాంగ్రెస్ నేతలను అశోక్ గజపతిరాజు, నారాయణ, నిమ్మలకిష్టప్ప, ఎన్.శివప్రసాద్ కలవనున్నారు. ఎన్ఎల్డీ, రాష్ట్రీయ లోక్‌దళ్, ఎస్డీఎఫ్, ఆర్పీఐ, మిగతా లెఫ్ట్ పార్టీలను రామ్మోహన్ నాయుడు, బుట్టా రేణుక, సీతారామలక్ష్మి కలిసి ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. అంతేకాదు అవసరమైతే పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని కూడా ఇదివరకే ఎంపీలకు చంద్రబాబు సూచించారు. అయితే చంద్రబాబు చేస్తున్న ఈ ఆఖరి ప్రయత్నం ఎంతమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే మరి.

English Title
Will Chandrababu Success Final Attempt On Centre
Related News