ఎవరిని పూజిస్తారు?

Updated By ManamThu, 09/20/2018 - 22:44
ganesh
  • అమెరికా ఎన్నికల్లో  రిపబ్లికన్ల ప్రచారంపై దుమారం

  • భారతీయ అమెరికన్ల మనోభావాలతో చెలగాటం 

ganeshటెక్సాస్/వాషింగ్టన్: వినాయకుడిని పూజిస్తారా? గాడిదను పూజిస్తారా? అంటూ సాగుతున్న ఎన్నికల ప్రచారం భారతీయ అమెరికన్లకు షాక్ ఇస్తోంది. అమెరికా ఎన్నికల్లో వివాదాస్పదమైన ప్రకటన అక్కడి హిందూ అమెరికన్ల మనోభావాలను ఘోరంగా దెబ్బతీస్తోంది.  సోషల్ మీడియాలో ఈనెల 12వ తేదీ నుంచి విస్తృతంగా ప్రచారమవుతున్న ప్రకటన టెక్సాస్‌లోని స్థానిక ‘ఇండియన్ హెరాల్డ్’ పత్రికలో ప్రచురితమై సంచలనం సృష్టించింది. రిపబ్లికన్ పార్టీ గుర్తు ఏనుగు కావడంతో ఈ నేపథ్యంతోనే వినాయకుడి కేరికేచర్ ప్రకటనను పార్టీ ప్రయోగించింది. గణేష్ చతుర్థి సందర్భంగా ఈ ప్రకటన జారీ చేయగా ‘‘ఇది అత్యంత ప్రమాదకరమైంది.. రాజకీయ పార్టీలను ఎవరు పూజిస్తారు?’’ అంటూ హిందూ అమెరికన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తక్షణం ఈ ప్రకటన ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశారు. భారత్‌లో అతిపెద్ద పండుగల్లో ఒకటైన వినాయక చతుర్థిని రాజకీయం చేస్తున్నారంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఈ జొమోటో లోగోను రిపబ్లికన్ పార్టీ ఉపయోగించడం నేరమనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ganesh

English Title
Who is worshiped
Related News