కోటలో పాగా వేసేదెవరు?

modi
  • నేడు రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు

  • 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు

  • బరిలో 2,274 మంది అభ్యర్థులు

  • మొదట్లో సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలం

  • మోదీ, అమిత్‌షా సుడిగాలి ప్రచారం

  • మారిన సమీకరణాలు.. ఓటర్ల మనోగతం

  • ఇక..బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ?

  • 11న తేలనున్న పార్టీల భవితవ్యం

జైపూర్: రాజస్థాన్ రాజెవరు? కిరీటధారి ఎవరు? సంప్రదాయాన్ని ఓటర్లు అనుసరిస్తారా? అందుకుభిన్నంగా ఓటేస్తారా? సంప్రదాయం ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? మోదీ హవా ముందు అది తిరగబడుతుందా? ఈ ఉత్కంఠకు తెరపడనుంది. పార్టీల భవిష్యత్తును ఈవీఎంలలో ఓటరు మహాశయులు శుక్రవారం నిక్షిప్తం చేయనున్నారు. ఈ నెల 11న ఎవరు కిరీటధారో తేలనుంది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను సెమీఫైనల్స్‌గా భావిస్తున్న తరుణంలో.. మరోసారి అధికారం నిలబెట్టుకుని పట్టు బిగించాలని బీజేపీ భావిస్తే.. బీజేపీని ఓడించి నైతికంగా దెబ్బకొట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్రమంలో రెండు పార్టీల అధినేతలు  అమిత్‌షా, ప్రధాని నరేంద్రమోదీ, ఇతర కేంద్ర మంత్రులు, సీఎం వసుంధరరాజే, రాహుల్‌గాంధీ, అశోక్‌గెహ్లాట్, సచిన్ పైలట్ తదితర ఉద్దండుల ప్రచారంలో రాజస్థాన్ హోరెత్తిపోయింది. రాజస్థాన్ ప్రజల నాడిని గమనిస్తే.. ఒక పార్టీకి రెండుసార్లు అధికారం అప్పగించిన చరిత్ర లేదు. తమిళనాడు తరహాలో ప్రతి ఎన్నికల్లో విపక్షానికి అధికారాన్ని అప్పగిస్తారు. ఈసారి రాజస్థాన్‌లోనూ అదే విధంగా జరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే.. ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షాలు రాజస్థాన్‌లో ఎలాగైనా పాగా వేయాలనే ఉద్దేశంతో సుడిగాలి ప్రచారాలు నిర్వహించారు. సంప్రదాయాన్ని బద్దలుకొట్టి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుని చరిత్ర సృష్టించాలని భావిస్తోంది. రైతు సమస్యలు, యువత, అవినీతి అనే అంశాలపైనే అన్ని పార్టీల ప్రచారం సాగింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అధ్యక్షడు రాహూల్ గాంధీలు  పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు.  బీజేపీ తరపున ఉత్తర ప్రదేశ్ ముఖ్య మంత్రి యోగీ ఆధిత్యానాథ్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు మంత్రులు కూడా ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీల మధ్య 130 స్థానాలకులో పోరు నువ్వా నేనా అన్నట్లు సాగనుండగా 50 స్థాలాల్లో రెండు ప్రధాన పార్టీల రెబల్ అభ్యర్థులు బరిలో తమ సత్తా నిరూపించుకోనున్నారు.

199 స్థానాలు.. 2,274 మంది అభ్యర్థులు..
రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారణకి బుధవారంతో తెరపడింది.  డిసెంబర్ 7 రాష్ట్రలోని 200 అసెంబ్లీ నియోజక వర్గాలకు గాను 199 స్థానాలకు ఎన్నిలకలు జరగనున్నాయి. 2,274 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. వారిలో 189 మంది మహిళా అభ్యర్థులున్నారు. అల్వర్ జిల్లాలోని రామ్‌గఢ్ నియోజవర్గంలో బీఎస్‌పీ ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోవడంతో ఆ ఒక్క స్థానంలో ఎన్నిక వాయిదా పడింది.  ఉదయం 8 గంటలకు ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగయనున్నాయి. రాష్ట్రలో మొత్తం 4.77కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

సర్వేలు ఏమంటున్నాయి..
రాజస్థాన్ ఎన్నికలపై ఇప్పటి వరకు వెలువడిన సర్వేలన్నీ కాంగ్రెస్‌వైపే మొగ్గు చూపడం గమనార్హం. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 45 కాంగ్రెస్‌కు అనుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయగా.. 44 శాతం మంది ప్రస్తుత బీజేపీ సర్కారుపట్ల మొగ్గు చూపారు.

సంబంధిత వార్తలు