విండీస్‌కు వైట్‌వాష్

Updated By ManamMon, 10/15/2018 - 03:42
umesh
  • 10 వికెట్లతో ఓటమిపాలైన కరేబియన్లు.. మూడ్రోజుల్లోనే ముగిసిన మరో టెస్టు..

  • ఉమేష్‌కు 10 వికెట్లు.. టీమిండియా 2-0తో సిరీస్ కైవసం

umeshహైదరాబాద్: వెస్టిండీస్ జట్టుకు టీమిండియా వైట్‌వాష్ చేసింది. రెండో టెస్టులోనూ కోహ్లీ సేన గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్లతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఉమేష్ యాదవ్ తొలిసారి 10 వికెట్ల ఘనత (6/88, 4/45) సాధించాడు. 72 పరుగుల గెలుపు లక్ష్యాన్ని టీమిండియా 16.1 ఓవర్లలో సాధించింది. ఓపెనర్లు పృథ్వీ షా, కేఎల్ రాహుల్ నాటౌట్‌గా నిలిచారు. ఏ టెస్టు సిరీస్ గెలుపైనా సంతోషదాయకం. డిసెంబర్ 4వ తేదీన ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ఇది మంచి సన్నాహకంగా చెప్పవచ్చు. వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో చూపిన పోరాట పటిమను రెండో ఇన్నింగ్స్‌లో ప్రదర్శించలేకపోయింది. పూర్తిగా రెండు సెషన్లు ఆడలేక 46.1 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. ఈ సిరీస్‌లో వెస్టిండీస్ ఆడిన నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 200 పరుగుల మార్క్‌ను మూడుసార్లు కూడా దాటలేకపోవడం ఈ సిరీస్‌లో ఆ జట్టు సత్తాను తెలియజేస్తోంది. టీమిండియాకు ఇది 10వ హోం సిరీస్ విజయం. చివరిసారి 2012 ఇంగ్లాండ్‌ను ఓడించింది. విరాట్ కోహ్లీ సేన 2013 సిరీస్‌ను తలపించింది. సచిన్ టెండూల్కర్ వీడ్కోలు సిరీస్‌లోనూ టీమిండియా ఇదే విధంగా గెలిచింది. 

పరుగుల ఖాతా ఓపెన్ చేయకముందే తొలి వికెట్ కోల్పోవడంతో వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి ఓవర్ రెండో బంతికి బ్రాగ్‌వైట్ అవుటయ్యాడు. తర్వాత రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో కీరాన్ పోవెల్ స్లిప్స్‌లో ఉన్న రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. షాయ్ హోప్ ఉమేష్ బౌలింగ్‌లో మూడు ఫోర్లు బాదాడు. హోప్‌తో కలిసి షిమ్రన్ హెట్మేయర్ 39 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. తొందరపాటుతో ఆడిన హెట్మేయర్ కుల్‌దీప్ బౌలింగ్‌లో పాయింట్ స్థానంలో ఉన్న చెటేశ్వర్ పుజారాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 45 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్ ఆ తర్వాత కూడా పెద్దగా ప్రతిఘటించలేదు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో హోప్ అవుటయ్యాడు. రహానే రెండో క్యాచ్ పట్టాడు. వెస్టిండీస్ ఆశాదీపం రోస్టన్ చేజ్ ఇన్‌స్వింగర్‌కు బలయ్యాడు. ఉమేష్ బౌలింగ్‌లో డౌరిచ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఉమేష్‌కిది తొమ్మిదో వికెట్. బ్యాటింగ్‌కు అంతో ఇంతో అనువైన హైదరాబాద్ పిచ్‌పై వెస్టిండీస్ ఆటగాళ్లు బ్రాత్‌వైట్, హెట్మేయర్ ఘోరంగా ఆడారు. జాసన్ హోల్డర్, సునీల్ ఆంబ్రిస్ ఏడో వికెట్‌కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. కానీ జడేజా బౌలింగ్‌లో హోల్డర్ అవుటైన తర్వాత మ్యాచ్ నాలుగో రోజుకు వెళుతుందన్న నమ్మకం సన్నగిల్లింది. 

అంతకుముందు టీ మిండియాను తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్ చేసింది. దీంతో టీమిండి యాకు 56 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. రిషబ్ పంత్, రహానే సెంచ రీలు చేయకుండానే వెనుదిరిగారు. పంత్ సెంచరీకి దగ్గరగా వ చ్చి అవుట్ కావడం వరుసగా ఇది రెండోసారి. 16.1 ఓవర్లలో టీమిండి యా 25 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. 314 పరుగులకు 4 వికెట్లతో ఉన్న టీమిండియా 339కి 9 వికెట్లు కోల్పోయింది. అశ్విన్ జట్టుకు ఉప యోగకరమైన సహకారాన్ని అందిం చాడు. రెండో కొత్త బంతి తీసుకోవడం విండీస్ కెప్టెన్ హోల్డర్‌కు ఉపయోగప డింది. అద్భు తమైన బౌలిం గ్‌తో ఐదోసారి ఇన్నింగ్స్‌కు ఐదు వికెట్ల ఘనత సాధించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఉమేష్ యాదవ్‌కు దక్కగా.. అరంగేట్ర యువ సంచలనం పృథ్వీ షా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

స్కోరుబోర్డు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 311
ఇండియా తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 308/4) రహానే (సి) హోప్ (బి) హోల్డర్ 80, పంత్ (సి) హెట్మేయర్ (బి) గాబ్రియేల్ 92, జడేజా ఎల్‌బిడబ్ల్యూ (బి) హోల్డర్ 0, అశ్విన్ (బి) గాబ్రియేల్ 35, కుల్‌దీప్ యాదవ్ (బి) హోల్డర్ 6, ఉమేష్ యాదవ్ (సి) సబ్‌స్టిట్యూట్ హామిల్టన్ (బి) వార్రికన్ 2, శార్దూల్ ఠాకూర్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 19; మొత్తం 106.4 ఓవర్లలో 367 ఆలౌట్; వికెట్ల పతనం: 5-314, 6-314, 7-322, 8-334, 9-339, 10-367; బౌలింగ్: గాబ్రియేల్: 20.4-1-107-3, హోల్డర్: 23-5-56-5, వార్రికన్: 31-7-84-2, చేజ్: 9-1-22-0, బిషూ: 21-4-78-0, బ్రాత్‌వైట్: 2-0-6-0.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (బి) పంత్ (బి) ఉమేష్ 0, పోవెల్ (సి) రహానే (బి) అశ్విన్ 0, హోప్ (సి) రహానే (బి) జడేజా 28, హెట్మేయర్ (సి) పుజారా (బి) కుల్‌దీప్ 17, ఆంబ్రిస్ ఎల్‌బిడబ్ల్యూ (బి) జడేజా 38, చేజ్ (బి) ఉమేష్ 6, డౌరిచ్ (బి) ఉమేష్ 0, హోల్డర్ (సి) పంత్ (బి) జడేజా 19, బిషూ నాటౌట్ 10, వార్రికన్ (బి) అశ్విన్ 7, గాబ్రియేల్ (బి) ఉమేష్ 1; ఎక్స్‌ట్రాలు: 1; మొత్తం 46.1 ఓవర్లలో 127 ఆలౌట్; వికెట్ల పతనం: 1-0, 2-6, 3-45, 4-45, 5-68, 6-70, 7-108, 8-109-, 9-126, 10-127; బౌలింగ్: ఉమేష్: 12.1-3-45-4, అశ్విన్: 10-4-24-2, కుల్‌దీప్: 13-1-45-1, జడేజా: 11-5-12-3.
ఇండియా రెండో ఇన్నింగ్స్: పృథ్వీ షా నాటౌట్ 33, కేఎల్ రాహుల్ నాటౌట్ 33; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం 16.1 ఓవర్లలో 75/0; బౌలింగ్: హోల్డర్: 4-0-17-0, వార్రికన్: 4-0-17-0, బిషూ: 4.1-0-19-0, చేజ్: 4-0-14-0. 

English Title
Whitewash to the Windies




Related News