ఐదేళ్లు మద్దతిస్తామో.. లేదో!

Updated By ManamFri, 05/25/2018 - 22:21
parameshwara
  • ఆ విషయంలో ఇంకా నిర్ణయించుకోలేదు.. శాఖల కేటాయింపు.. సుపరిపాలన ముఖ్యం

  • మిగలిన విషయాలపై మేం చర్చించుకోవాలి.. బాంబు పేల్చిన ఉప ముఖ్యమంత్రి పరవేుశ్వర

parameshwaraబెంగళూరు: కర్ణాటకలో కొత్త సర్కారు ఇలా కొలుమదీరిందో లేదో.. అప్పుడే ముసలం మొదలయ్యే లక్షణాలు కనిపిస్తున్నాయి. హెచ్‌డీ కుమారస్వామికి ముఖ్యమంత్రిగా ఐదేళ్లు మద్దతు ఇవ్వాలో.. లేదో ఇంకా తాము నిర్ణయించుకోలేదని ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు జి. పరవేుశ్వర బాంబు పేల్చారు. ఈ విషయాన్ని తాము చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. ముందు విశ్వాసపరీక్ష నెగ్గడం, మంత్రిత్వశాఖల కేటాయింపు, సుపరిపాలన అందించడం తమ లక్ష్యాలన్నారు. ముఖ్యమంత్రి పదవిని పంచుకోవడం సహా మిగిలిన విషయాలు ఇంకా చర్చించుకోవాలన్నారు. ఉప ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన తర్వాత శుక్రవారం నిర్వహించిన మొదటి విలేకరుల సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నా ముఖ్యమంత్రి పదవిని జేడీఎస్‌కు వదిలినందుకు తమకు కీలక శాఖలు కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేవలం 37 మంది ఎమ్మెల్యేల బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న కుమారస్వామి మాత్రం.. దాన్ని పంచుకోడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. దీన్ని ఒక మంచి సంకీర్ణంగా తయారుచేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన అంటున్నారు. తన పదవీకాలం, ప్రభుత్వ ఏర్పాటు గురించి ఇంకా సమావేశం నిర్వహించుకోవాలని చెప్పారు. 2019 లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ ముందుకు రాదని.. అలా చేస్తే బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఎలాగైనా కీలక మంత్రిత్వశాఖలు పొందాల్సిందేనని కాంగ్రెస్ నాయకులు గట్టి పట్టుదలతో ఉన్నారు. జేడీఎస్‌తో జట్టుకట్టడం పట్ల అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నాయకులను పరవేుశ్వర కాస్త చల్లబరుస్తారని చాలామంది భావించారు. కానీ ఆలోపే ఆయన బాంబు పేల్చడంతో అంతా ఉలిక్కిపడ్డారు. ఒకవేళ పరవేుశ్వర అన్నట్లే రొటేషన్ పద్ధతి వస్తే.. కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవి రేసులో డీకే శివకుమార్ ముందున్నారు. బీజేపీ నేతలకు తమ ఎమ్మెల్యేలు అందకుండా దాచిపెట్టడంలో డీకే పాత్ర చాలా కీలకం. తనకు ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్ష పదవితో పాటు కీలక మంత్రిత్వశాఖ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారు.

English Title
Whether it will support five years ..
Related News