ఆరోగ్యంలో మనమెక్కడ?

Updated By ManamSun, 10/28/2018 - 12:02
makutam

image‘‘బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతకకూడదు’’ అంటారు ఒక కథలో ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు. నిజమే. ఆరోగ్యంగా బతకడం చాతకానివాళ్లు చాలా కాలం బతికితే వాళ్లకే కాదు, వాళ్ల చుట్టూ ఉండేవాళ్లకూ నరకంగానే ఉంటుంది. ఆరోగ్యంగా బతకడానికి జీవనశైలితో పాటు, ఆహార నియమాలతో పాటు, ఆరోగ్యంపై శ్రద్ధతో పాటు ఆరోగ్య బీమా కూడా అవసరం. మన దేశంలో ఆరోగ్య బీమా లేకపోవటాన ఏదైనా తీవ్ర అనారోగ్యానికి గురైన సందర్భాల్లో ఖరీదైన వైద్య చికిత్స పొందలేక అనేకమంది అర్ధంతరంగా మరణిస్తున్నారనేది 
విచారకరమైన వాస్తవం.

భారతదేశ ప్రస్తుతం జనాభా 134 కోట్లు. గత పాతికేళ్లలో 45 కోట్ల మంది కొత్తగా జమయ్యారు. అయితే ఈ కాలంలో పేదరికంలో జీవిస్తున్న వారి సంఖ్య సగానికి సగం పడిపోయింది. చిత్రంగా ఒక పక్క సంపద పెరుగుతుంటే ఇంకో పక్క వ్యాధుల భారం కూడా పెరుగుతూ వచ్చింది. ఈ కాలాన్ని ‘ద్వంద్వ వ్యాధి భార కాలం’గా చెప్పుకుంటున్నారు. అంటే ఓ వైపు అంటువ్యాధులు, మరో వైపు జీవనశైలి వ్యాధులు గణనీయంగా పెరిగాయి. 2015లో చోటు చేసుకున్న మరణాల్లో సగం పైగా మరణాలు ఈ వ్యాధుల వల్లే సంభవించాయి. ఈ తరహా మరణాలు 2001-03 కంటే 2015కి ఏకంగా 42 శాతం పెరిగాయి!
 

image

ఆర్థికాభివృద్ధి, మెరుగైన ఆరోగ్య అవగాహన, వేగంగా పెరుగుతున్న జనాభాతో పాటు పెరుగుతున్న వృద్ధుల జనాభాపై ఈ వ్యాధుల భారం పడిన ఫలితంగా  దేశంలో ఆరోగ్య పరిరక్షణ పరిశ్రమ 1990 నుంచి 11 శాతం పెరిగి 2013 నాటికి 81.3 బిలియన్ డాలర్లకు (రూ. 54,086 లక్షల కోట్లకు) చేరుకుంది. ఇది ఇలానే పెరుగుతూ 2020 నాటికి 17 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా.

అదే జరిగితే.. మొబైల్ టెక్నాలజీ, మెరుగైన సమాచార సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని భావిస్తున్నారు. పరిమితమైనప్పటికీ, కొన్ని కంపెనీలు వినూత్న సేవల్లో పెట్టుబడి పెట్టడంతో పాటు, లాభదాయక, తక్కువ ఖర్చుతో కూడిన డిజిటల్ పరికరాలను సృష్టిస్తున్నాయి. వీటికి ఉదాహరణగా జీఈ హెల్త్ కేర్ సంస్థ ‘లుల్లబి బేబీ వార్మర్’ని చెప్పుకోవచ్చు. అయితే, కొన్ని పురోగతులు ఉన్నప్పటికీ, భారతదేశ ఆరోగ్య పరిరక్షణ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

62 శాతం జనం సొమ్మే
స్థూల జాతీయోత్పత్తితో పోల్చుకుంటే ప్రస్తుతం మన ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం చేసే ఖర్చు చాలా తక్కువ. మన తలసరి ఆరోగ్య ఖర్చు చాలా తక్కువ. అదే చైనా అయితే గరిష్ఠంగా 5.6 రెట్లు, అమెరికా అయితే 125 రెట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. భారతీయులు తమ ఆరోగ్య పరిరక్షణకు చేసే ఖర్చులో 62 శాతం తాము పొదుపు చేసుకున్న డబ్బు నుంచే వాడుతుంటారు. అంటే ఆ ఖర్చులన్నీ తమ సొంత జేబు నుంచే పెడుతుంటారన్న మాట. ఇదే చైనాలో 54 శాతం, అమెరికాలో 13.4 శాతం, ఇంగ్లండ్‌లో 10 శాతంగా మాత్రమే ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకోవాలంటే (తీర్చాలంటే) భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు సరిపోవు.
 

image

దేశవ్యాప్తంగా ఆరోగ్య పరిరక్షణ రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యమే అధికంగా ఉంది. మన దేశంలో దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్న జనాభా (బిపిఎల్) ఎక్కువ. పట్టణ ప్రాంతాల్లో నివసించే వారికి రోజుకు రూ. 47, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి రోజుకు రూ. 32 మాత్రమే ఖర్చు చేయగల సామర్థ్యం వుంది. అందువల్ల వారు ఆరోగ్య పరిరక్షణ అవసరాల కోసం తప్పనిసరిగా ప్రభుత్వ రంగంపై ఆధారపడుతున్నారు. నిధుల కొరత, సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వ రంగం వారి అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతోంది.

అంతేకాక, ఎక్కువమంది ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు పట్టణ ప్రాంతాల్లోనే కేంద్రీకృ తమై ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడి వినియోగదారులు గ్రామీణ ప్రాంతాల వారికంటే ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టగలరు కాబట్టి. వైద్యుల సంఖ్యాపరంగా భారతదేశం ప్రపంచ సగటును చేరుకోగలిగిందనేది నిజమే. అయితే 74 శాతం మంది వైద్యులు జనాభాలో కేవలం మూడవ వంతుకి అంటే 44.2 కోట్ల మందికి మాత్రమే సేవలందిస్తున్నారని కేపీఎంజీ సంస్థ నివేదిక వెల్లడించింది.

చైనా, అమెరికాతో పోల్చుకుంటే భారతదేశంలోని ఆసుపత్రుల్లో పడకల, నర్సుల సంఖ్య చాలా తక్కువ. ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ గణాంకాల ప్రకారం మన దేశంలోని గ్రామీణ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో (సీహెచ్‌సీలు) 81 శాతం వైద్య నిపుణుల కొరత ఉండగా, మొత్తం పడకల్లో 63 శాతం ప్రైవేటు హాస్పిటళ్లలోనే ఉన్నాయి. 
ప్రధాన అడ్డంకులు

జనాభా: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా కలిగిన దేశం మనది. 1985లో 76 కోట్ల మంది జనాభా ఉండగా, 2018కి అది 134 కోట్లకు పెరిగిందని అంచనా.

మౌలిక సదుపాయాలు: ప్రస్తుతం దేశంలో ఉన్న ఆరోగ్య పరిరక్షణ వ్యవస్థ ప్రజల అవసరాలను తీర్చడానికి సరిపోదు. imageకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సార్వజనీన ఆరోగ్య సేవలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స, అత్యవసర మందులు వంటివి అందిస్తున్నాయి. అయితే ముందుగా చెప్పినట్లుగా, ప్రభుత్వ ఆసుపత్రులు డాక్టర్ల కొరత, నిధుల కొరత కారణంగా రోగులను తప్పనిసరిగా ప్రైవేట్ వైద్యులు, హాస్పిటళ్లకు వెళ్లి చికిత్స చేయించుకునే విధంగా చేస్తున్నాయి.
ఇన్సూరెన్స్: భారతదేశం ప్రపంచంలోనే తక్కువ తలసరి ఆరోగ్య పరిరక్షణ ఖర్చు చేసే దేశాల్లో ఒకటిగా వుంది. మన దేశంలో ఆరోగ్య బీమాకి ప్రభుత్వం నుంచి అందే సహకారం సుమారు 32 శాతమే. అదే యూకేలో అయితే ప్రభుత్వ సహకారం 83.5 శాతం. శోచనీయమైన విషయమేమంటే ఆరోగ్య చికిత్సల కోసం భారతీయులు తమ జేబులు ఖాళీ చేసుకుంటూ ఉండటం. 76 శాతం మంది భారతీయులకు ఆరోగ్య బీమా అనేదే లేదు. జాతీయ ఆరోగ్య బీమా పథకం (రాష్ట్రీయ స్వాస్థ్య సురక్షా యోజన) ఉన్నప్పటికీ దాని నుంచి అందుతున్న ప్రయోజనం తక్కువేనని విశ్లేషకులు వాదిస్తున్నారు.

గ్రామీణ-పట్టణ వ్యత్యాసం: గ్రామీణ ఆరోగ్య సంరక్షణా మౌలిక సదుపాయాలు మూడు దశలుగా ఉన్నాయి. మొదట ఉపకేంద్రం, ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ), ఆ పైన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఉన్నాయి. పీహెచ్‌సీలలో 3,000 మంది డాక్టర్ల కొరత వుంది. గడచిన పది సంవత్సరాలలో ఈ కొరత 200 శాతం పెరిగి 27,421కి చేరింది. 

అయితే, భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరిచేందుకు ఆశావహ పరిస్థితులు ఉన్నాయి. 2018-19 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థూల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి చర్యలను నిర్దేశించారు. ఆరోగ్య బడ్జెట్ 27 శాతం పెరిగింది. అయితే ఈ కేటాయింపులు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఉంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, కొత్త ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాల విషయంలో.
 
రెండు ‘రాఫెల్’ విమానాల కంటే తక్కువే!
జాతీయ ఆరోగ్య బీమా పథకం (రాష్ట్రీయ స్వాస్థ్య సురక్ష యోజన) ఇప్పటికే అమలులో ఉన్న పథకానికి ఒక చిన్నimage మెరుగుదల మాత్రమే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ బీమా ద్వారా ప్రయోజనం పొందే ప్రతి కుటుంబ వార్షిక పరిమితిని రూ. 30,000 నుంచి రు.1,00,000కు పెంచారు. వయో వృద్ధులకు అదనంగా రూ.30,000 పెంచారు. దేశంలోని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అన్ని (బీపీఎల్) కుటుంబాలను ఆరోగ్య బీమా కార్యక్రమాల కిందకు తీసుకు వస్తే రూ. 2,460 కోట్ల నుంచి రూ. 3,350 కోట్ల వరకు వ్యయమవుతుంది. ఇది రెండు ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాల వ్యయం కంటే తక్కువే!

సామాజిక రంగ పథకాలకు పెద్ద ఎత్తున ఐటీ అప్లికేషన్లను వాడుతున్న కారణంగా సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) పెద్ద పాత్ర పోషించనుంది. ప్రభుత్వ బీమా పథకం కింద ఉన్న అన్ని ఆసుపత్రులను ఐటీ ఆధారిత ఆసుపత్రులుగా అభివృద్ధి చేసి వీటిని జిల్లాల్లోని సర్వర్లకు అనుసంధానించారు. లబ్ధిదారులు ఒక స్మార్ట్ కార్డు సహాయంతో బీమా పథకం కింద ఉన్న ఆసుపత్రులకు వెళ్లి అందుబాటులో ఉన్న ఆరోగ్య సేవలను పొందవచ్చు. అదనంగా, 2016లో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దేశంలో అనేక కొత్త కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఆధారిత ఇ-హెల్త్, ఎం-హెల్త్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా స్వస్థ భారత్ అనే మొబైల్ అప్లికేషన్.. వ్యాధులు, వాటి లక్షణాలు, చికిత్స, ఆరోగ్య హెచ్చరికలు, చిట్కాలపై సమాచారం అందచేస్తుంది. హెల్త్ వర్కర్లకు ‘అన్‌మోల్-ఏఎన్‌ఎమ్’ అనే ఆన్‌లైన్ టాబ్లెట్ అప్లికేషన్, ‘ఇ-రక్తకోష్’ అనే ఒక బ్లడ్-బ్యాంకు నిర్వహణ సమాచార వ్యవస్థ, ‘ఇండియా ఫైట్స్ డెంగ్యూ’ అనే అప్లికేషన్ ప్రారంభమయ్యాయి. 

ఏ రాష్ట్రానికా రాష్ట్రం టెక్నాలజీ మద్దతుతో వివిధ ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశ పెడుతోంది. ఉదాహరణకు, కర్ణాటక ప్రభుత్వం ఆమధ్య ప్రకటించిన నగదు రహిత ఆరోగ్య బీమా పథకాలకు సాంకేతిక భాగస్వామిగా రెమిడీనెట్ టెక్నాలజీ (భారతదేశపు మొట్టమొదటి పూర్తి నగదు రహిత, ఎలక్ట్రానిక్ ఆరోగ్య బీమా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ నెట్ వర్క్)తో ఒప్పందం కుదుర్చుకుంది. 

ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుండటంతో, ప్రైవేటు పెట్టుబడులు, స్టార్టప్ సంస్థలు ఈ రంగంపై విశేష శ్రద్ధను కనబరుస్తున్నాయి. 
imageప్రభుత్వపు నేషనల్ ఇన్నోవేషన్ కౌన్సిల్, హెల్త్ కేర్ డొమైన్ నిపుణులు, వాటాదారుల, ఇతర కీలక భాగస్వాముల మధ్య సహాయ సహకారాల కోసం తప్పనిసరిగా ఒక వేదికను అందుబాటులో ఉంచాలి. అందులో భాగంగా భారతదేశంలో ఆవిష్కరణ (ఇన్నోవేషన్) సంస్కృతిని ప్రోత్సహించాలి. ఒక నూతన భారతీయ విధానాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి. అంతే కాకుండా మరింత సరసమైన ధరలో నాణ్యమైన రోగ నిర్ధారణ, సంరక్షణ అందించే ఉత్పత్తులు, వ్యాపార నమూనాలు తయారు చేయడానికి ప్రైవేటు రంగం కూడా ‘పొదుపు ఆవిష్కరణ’లపై దృష్టి పెట్టింది.
ఇప్పుడు భారతదేశపు ఆరోగ్య పరిరక్షణ రంగ అన్ని దశలలో (నివారణ, నిర్ధారణ, చికిత్స) విశేషమైన మార్పులు జరగబోతున్నాయి. ఆరోగ్య పరిరక్షణ రంగంలోని ఏ ఒక్క అనుబంధ సంస్థా స్వతంత్రంగా పని చేయలేదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానితమై ఉన్నాయి. 

నిర్లక్ష్యం వీడాలి
ఈ ఏడాది జూలైలో, ఆరోగ్య బీమా పాలసీలలో మినహాయింపులను పరిశీలించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ ఆఫ్ ఇండియూ (ఇర్డాయ్) ఒక వర్కింగ్ గ్రూప్‌ని ఏర్పాటు చేసింది. దాన్నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే మెుదట దేశంలో ఆరోగ్య బీమా ఎలా పరిణామం చెందిందో చూడాలి. 1986లో దేశంలో ఆరోగ్య బీమా సౌకర్యం ప్రారంభమైంది. 2006 వరకు దానిలో దాదాపు ఎలాంటి వృద్ధీ లేదు. కానీ గత దశాబ్ద కాలంగా ఆరోగ్యimage బీమా గణనీయమైన స్థాయిలో పెరిగింది. కీలకమైన ఆవిష్కరణలు జరిగారుు. వినియోగదారుల ఆసక్తి ఆధారంగానే ఇది నడుస్తుంది. నాణ్యమైన ఆరోగ్య పరిరక్షణ అవసరాన్నీ, అందులో బీమా అనేది ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తుందనే విషయూన్నీ వారు గుర్తించారు. అంటే మన జీవిత కాలాన్ని పెంచుకోవడంలో ఆరోగ్య బీమా కీలకంగా మారింది. కాబట్టి ఆరోగ్య బీమాని మరింత మెరుగుపరిస్తే మరింత మందికి ప్రయోజనం లభిస్తుంది. దీనికి కావాల్సింది స్థిర ప్రయత్నం. బీమాతో పొందే ప్రయోజనం వ్యక్తిగతమైంది కాబట్టి, దాన్ని వినియోగదారుని పరంగా చాలా సున్నితమైన అంశంగా చెప్పాలి. ఉదాసీనతకు అవకాశం ఉన్న మోటార్ ఇన్సూరెన్స్ కెయిమ్ లాగా కాకుండా, ఆరోగ్య బీమా ప్రయోజనం అనేది వ్యక్తిగతమైంది. అందువల్ల వినియోగదారులకు ఆ బీమా ప్రయోజన అనుభవం మృదువుగా ఉండేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. బీమా అవసరమైన సందర్భాల్లో కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు నిర్లక్ష్యంగా, ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వినియోగదారులు అసహనానికీ, అసౌకర్యానికీ గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నారుు. అలాంటివి జరక్కుండా ఆయూ సంస్థలతో పాటు ప్రభుత్వమూ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బీమా విషయంలో సరైన ప్రమాణాలను నిర్దేశించి, వాటిని కచ్చితంగా అమలు చేయూలి.
ఆలోచనకు, ఆచరణకు మధ్య వున్న ఖాళీని నూతన ఆవిష్కరణలతో నింపడానికి అందరు వాటాదారుల సహాయ సహకారాలను ఈ రంగం ఆశిస్తోంది. అప్పుడే పరిణామం సాధ్యపడుతోందని నమ్ముతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న అనుసంధానమవని ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డులు, ఎక్కువగా వెచ్చించేటటువంటి ఇబ్బందులను అధిగమించి, తేలికగా ముందుకు వెళ్లే సత్తా భారతదేశానికి వుంది. అయితే, భారతదేశం ఈ అవకాశాన్ని ఎంతమేరకు అందిపుచ్చుకోగలదనేదే అసలు ప్రశ్న.

ఆయుష్మాన్ భారత్
హర్యానాలోని ఇంద్రి అనే చిన్న పట్నానికి చెందిన అమిత్‌కుమార్ దినసరి కూలీ. ఈ ఆగస్టులో ఆయన భార్య మౌసమికి కల్పనా చావ్లా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో రెండో బిడ్డ పుట్టినప్పుడు బిల్లు కటడానికి వెళ్లాడు. అక్కడ అతనికిచ్చిన బిల్లు విలువ అక్షరాలా రూ. 35 మాత్రమే. అది కూడా పుట్టిన పాపకు సంబంధించిన బర్త్ సర్టిఫికెట్ కోసం. ఆ బిల్లు చూసుకొని అమిత్‌కుమార్‌కు ఆశ్చర్యం, ఆనందం.. రెండూ కలిగారుు. ఇంత తక్కువ బిల్లు ఎలా సాధ్యమైందంటే కొత్తగా వచ్చిన ‘ఆయుష్మాన్ భారత్’ పథకం వల్ల. దేశంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 40 శాతం (దాదాపు 50 కోట్ల మంది) జనాభాకు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. దీని వెనుక ఎన్ని రాజకీయ లెక్కలు ఉండనీ గాక, నిజంగా ఈ పథకం గనుక సమర్థవంతంగా అమలైతే మనదేశపు ఆరోగ్య పరిరక్షణ ముఖచిత్రమే మారిపోతుంది. ఈ పథకం కిందకు వచ్చే వాళ్లు ఎవరైనా జాబితాలోని హాస్పిటల్‌కు వెళ్లి, డబ్బుతో నిమిత్తం లేకుండా వైద్య సేవలు పొందవచ్చు. సూపర్ స్పెషలిస్ట్ జోక్యంలేని సెకండరీ చికిత్స కోసం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల మెుత్తాన్ని బీమా కింద ఈ పథకం కేటాయిస్తోంది. లబ్ధిదారులు ఈ బీమా సౌకర్యం పొందడానికి ఒక్క పైసా చెల్లించాల్సిన పనిలేదు. ఈ ఇన్సూరెన్స్ వ్యయూన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిన చెల్లిస్తారు. అంటే లబ్ధిదారులు ఈ పథకం అమలులో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా చికిత్స పొందవచ్చన్న మాట. ప్రస్తుతం ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 8,500 హాస్పిటళ్లు ప్రయోజనాన్ని కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

క్లిష్ట అనారోగ్య పాలసీ
imageఆరోగ్య బీమా మరింత సమగ్రంగా ఉండాలి. కొత్త మార్గాల్లో చికిత్స అందివ్వడానికి హాస్పిటళ్లకు వెసులుబాటు కల్పించాలి. ఇది వ్యయంపై ప్రభావం చూపించవచ్చు. కానీ వినియోగదారునికి సరైన చికిత్స అందించడంలో రాజీపడని విధంగా బీమా ప్రయోజనం ఉండాల్సిందే. తమ ఆరోగ్య బీమా మరింత సమగ్రంగా ఉండేలా వినియోగదారులు కూడా ప్రయత్నించాలి. సాధారణ ఆరోగ్య పాలసీ అనేది ప్రతి ఒక్కరికీ ప్రాథమిక ప్రయోజనాన్ని కల్పిస్తుంది. మరింత కాస్ట్-ఎఫెక్టివ్ పద్ధతిలో బీమా ప్రయోజనం పెంచుకోవాలంటే టాప్-అప్ ప్లాన్‌కు వెళ్లాలి. అదే క్లిష్ట అనారోగ్య పాలసీ తీసుకున్నవాళ్లకైతే క్లిషమైన జబ్బు సోకినట్లు నిర్ధారణ అయితే, ఎక్కువ మెుత్తంలో ప్రయోజనం పొందే వీలుంటుంది. అంటే మెరుగైన వైద్య చికిత్స అందుతుంది. క్రిటికల్ ఇల్‌నెస్ ప్లాన్లు చౌకగా లభిస్తుండటం, వాటి కెయిమ్‌లు సరళంగా ఉండటం దీనికి కారణం. ఉదాహరణకు బీమా సౌకర్యం కలిగిన ఒక స్త్రీ డయేరియూ, జ్వరంతో ఆసుపత్రి పాలైనప్పుడు, ఆమె డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు. క్లిష్ట అనారోగ్య పథకంలో భాగంగా ఆమెకు చికిత్స అందుతుంది. ఆసుపత్రి బిల్లును ఇన్సూరెన్స్ కంపెనీయే భరిస్తుంది.
 

English Title
Where are we in health?
Related News