వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్...

WhatsApp is reportedly working on a fingerprint authentication feature

న్యూఢిల్లీ :  ప్రముఖ మెసేజింగ్‌ అప్లికేషన్‌ వాట్సాప్‌‌లో మరో కొత్త ఫీచర్ రానుంది. వాట్సాప్‌లో మీరు చేసే మెసేజ్‌లు మరొకరు చూడకుండా ఆప్షన్ త్వరలో అందుబాటులోకి వచ్చేస్తోంది. వాట్సాప్‌‌లో తమ సంభాషణలు ఇతరులు చూడకుండా ఉండేలా ఆండ్రాయిడ్‌ వెర్షన్లో వాట్సాప్‌కు ఫింగర్‌ ప్రింట్‌ అధెంటికేషన్‌ ఆప‍్షన్‌ రాబోతుంది. దీంతో ఇకపై వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలంటే తప్పనిసరిగా వేలిముద్ర అవసరమని వెబ్‌​ఈటల్‌ ఇన్ఫో అనే వెబ్‌సైట్‌ నివేదించింది. 

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లకు ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ద్వారా వాట్సాప్‌లో తాము చేసే ఛాటింగ్ వివరాలను గోప్యంగా ఉంచుకునేందుకు వీలుంది.  వాట్సప్ సెట్టింగ్స్‌లో ప్రైవసీ అనే  విభాగంలో అథంటికేషన్ అనే ప్రత్యేకమైన సెక్షన్లో ఫింగర్ ప్రింట్ అనే ఆప్షన్‌ని తీసుకువచ్చింది. దీన్ని ఎనేబుల్ చేసుకున్నప్పుడు, మీ వాట్సప్ అప్లికేషన్ కి పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది.  కేవలం మీరు మాత్రమే మీ ఫింగర్ ప్రింట్ ద్వారా వాట్సప్ అప్లికేషన్ లోకి ప్రవేశించడానికి వీలు పడుతుంది.

మీ ఫోన్లో వాట్సప్ అప్లికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా ఇతరులు మీ ఫోన్ లో ఉన్న ఛాట్ కన్వర్‌జేషన్లు చూడడానికి ప్రయత్నించినప్పుడు అది లోపలికి అనుమతించదు. పరోక్షంగా చెప్పాలంటే, ఇది యాప్ లాక్‌గా ఉపయోగపడుతుంది. వెబ్‌బీటా ఇన్ఫో ఈ మేరకు వివరణాత్మక పోస్ట్ చేసింది. కాగా  వాట్సాప్ తీసుకు వచ్చే  నూతన ఫీచర్‌లో... ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఫీచర్‌ పరీక్ష ఇంకా ప్రయోగ దశలోనే ఉంది

సంబంధిత వార్తలు