వాట్సాప్.. నయా ఆడియో, వీడియో కాలింగ్

Updated By ManamThu, 06/21/2018 - 17:19
Whatsapp Audio and Video Calling Extended For Group Feature

Whatsapp Audio and Video Calling Extended For Group Featureవాట్సాప్‌లో ఇప్పటికే ఆడియో కాల్, వీడియో కాల్ ఫీచర్లున్నాయి. వాట్సాప్ గ్రూపుల్లో మాత్రం ఆ ఫీచర్ లేదు. ప్రస్తుతం ఆ ఆడియో, వీడియో కాల్ సౌకర్యా్న్ని వాట్సాప్ గ్రూపులకూ విస్తరించింది. కేవలం ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే ఆ సౌకర్యాన్ని కల్పించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ సౌకర్యాన్ని ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులు ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం వాట్సాప్‌ను 2.18.189 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. గ్రూప్ ఆడియో కాల్ సౌకర్యం కోసం 2.18.192 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాలని వెల్లడించింది.

కాగా, ప్రస్తుతం ఈ వెర్షన్స్ రెండూ వాట్సాప్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంచామని చెబుతూ.. ప్రయోగాత్మక పరీక్షలు పూర్తిచేసి అతి త్వరలో ఆండ్రాయిడ్ వినియోగదారులకూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఇక బీటా టెస్టర్‌గా మారి ఈ వెర్షన్‌ను పరీక్షించి చూడాలనే ఉత్సాహం ఉన్నవారు గూగుల్ ప్లేస్టోర్ ద్వారా చూడొచ్చని తెలిపింది. దీంతోపాటు మున్ముందు విండోస్ ఫోన్ యూజర్లకూ ఈ గ్రూప్ ఆడియో, వీడియో కాలింగ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు  కంపెనీ వెల్లడించింది. ఇప్పటికైతే వీడియో, ఆడియో కాల్ చేసిన వ్యక్తితో కలిపి మొత్తం నలుగురు ఒకేసారి మాట్లాడుకునే అవకాశం ఉందని తెలిపింది. తొలుత ఓ కాల్ చేశాక.. స్క్రీన్ మీద యాడ్ పార్టిసిపెంట్ బటన్ ద్వారా మరో ఇద్దరికి కాల్ చేసి గ్రూప్‌గా మాట్లాడొచ్చని వివరించింది.

English Title
Whatsapp Audio and Video Calling Extended For Group Feature
Related News