తుమ్మిడిహెట్టికి ఏం పేరు పెడతారు?

Updated By ManamWed, 05/16/2018 - 01:51
uttam
  • గవర్నర్‌కు పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రశ్న.. ప్రాజెక్టును సందర్శించిన కాంగ్రెస్ బ‌ృందం

uttamkumarహైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున ప్రజాధనం వృథా చేస్తున్నారని పీసీసీ అధ్య క్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన తుమ్మిడిహెట్టిని సందర్శించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలను, మేదావులను సైతం మోసం చేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కాలేశ్వరం ప్రాజెక్టు కడుతూ ప్రజలపై భారం మోపుతున్నారని చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్టు అని గవర్నర్‌తో సహా అందరి చేత శెభాష్‌లు కొట్టించుకుంటున్నారని, ఇలా చెబుతున్న వారు ముందుగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును సందర్శించాలని ఉత్తమ్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి సీఎం కేసీఆర్‌కు కాలేశ్వరరావు అని పేరుపెట్టిన గవర్నర్ తుమ్మిడిహెట్టికి వచ్చి ఏం పేరుపెడతారో చెప్పాలన్నారు. 38 వేల కోట్లతో గ్రావిటీతో పూర్తయ్యే తుమ్మిడిహెట్టిని వదిలేసి లక్ష కోట్లతో లిఫ్ట్‌లతో పని చేసే కాళేశ్వరం ఎంందుకు నిర్మిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుట్రపూరితంగా, దోపిడీ చేయాలన్న ఉద్దేశ్యంతోనే తుమ్మిడిహెట్టిని పక్కన పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను చేపట్టారని ఆరోపించారు.  తుమ్మిడిహెట్టిని ప్రాజెక్ట్‌ను 150 మీటర్ల ఎత్తులో చేపడితే మహారాష్ట్రలో మూడు వేల ఎకరాలు మునుగుతాయని అసెంబ్లీలో చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని ఎత్తును 148 మీటర్లకు తగ్గిస్తున్నట్లు చెప్పారని, మరి అదే ఎత్తులో ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు నిర్మించడంలేదని ఉత్తమ్ ప్రశ్నించారు. కమిషన్ల కక్కుర్తి కోసమే శాశ్వత గుదిబండగా మారే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారని విమర్శించారు. 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 38 వేల కోట్లతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్న సమయంలో చేపట్టారని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా సాధిస్తామని చెప్పి ఎందుకు ఆపేశారో చెప్పాలన్నారు. తుమ్మిడిహెట్టికి కమీషన్లు రావనే కాశేళ్వరం ప్రారంభించారన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి అని నామకరణం చేస్తే అంబేద్కర్ పేరు ఎందుకు తొలగించారో సీఎం చెప్పాలన్నారు. పక్క రాష్ట్రంలో మూడు వేల ఎకరాలు మునిగిపోతున్నాయని బాధపడి, సొంత రాష్ట్రంలో మాత్రం దళిత, నిరుపేదల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ప్రాజెక్ట్‌ల పేరుతో ధనవంతులు అవుతుంటే ప్రజలు మాత్రం నిరుపేదలు అవుతున్నారన్నారు. ప్రాజెక్ట్‌ల రీడిజైన్ పేరుతో జరుగుతున్న అవకవతకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

English Title
What is the name of Tummidhi?
Related News