నేనే నాయకుడిని అంటే ఎట్లా?

vinod kumar

కరీంనగర్: కాంగ్రెస్ పార్టీతో ఏపీ సీఎం చంద్రబాబు జట్టుకట్టారు. కూటమి లో కలిసిన చంద్రబాబు.. నేనే నాయకు డిని అనడం సరికాదు. నేనే కూటమిని ఏర్పా టు చేశానని చంద్రబాబు ప్రచారం చేసు కుంటున్నాడని కరీం నగర్  ఎంపీ వినోద్ కుమార్ విమర్శించారు. ఆర్థికంగా వెనుకబ డిన వారికి పది శాతం రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం నిన్న లోక్ సభలో ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో గిరిజ నుల, బీసీల శాతం పెరిగింది. అందుకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం లకు రిజర్వేషన్లు పెంచుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపా రు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50శాతం రిజర్వేషన్లు దాటుతున్నా యన్న వంక చూపెట్టారు. అగ్ర వర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు పెంపు మంచిదే.. కానీ హడావుడిగా తీసుకున్న నిర్ణయమని వ్యాఖ్యా నించారు. అగ్రవర్ణాల్లోనూ రిజర్వేషన్లు ఉండటంతో అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లవు తుందని అన్నారు.

సంబంధిత వార్తలు