భారత్‌ నుంచి చైనా దీన్ని నేర్చుకోవాలి

Updated By ManamMon, 03/12/2018 - 14:51
china yoga
China Yoga

న్యూఢిల్లీ: కమ్యూనిస్టు దేశం చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ప్రతి రోజూ ఏదో ఒక భారత వ్యతిరేక కథనాన్ని ప్రచురిస్తూ ఉంటుంది. అయితే సాంప్రదాయానికి భిన్నంగా ఆ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. భారత్ నుంచి చైనా నేర్చుకోదగ్గ అంశం ఇదేనంటూ ఓ భారత సానుకూల కథనాన్ని ప్రచురించింది. యోగాను విదేశాలకు ఎగుమతి చేయడంలో భారత్ విజయం సాధించిందిందని పేర్కొంది. యోగాతో పాటు తమ దేశ సంస్కృతిని విదేశాలకు ఎగుమతి చేయడంలో భారత్ ఎంతో చాకచక్యాన్ని ప్రదర్శిస్తోందని అభినందించింది. ఈ అంశాన్ని భారత్ నుంచి చైనా కూడా ఎంతో నేర్చుకోవాల్సి ఉందంటూ ఆ కథనంలో పేర్కొంది. భారత సంస్కృతిని విదేశాలకు ఎగుమతి చేయడంలో బాలీవుడ్ సినీ పరిశ్రమ పాత్ర కూడా కీలక పాత్ర పోషిస్తోందని గ్లోబల్ టైమ్స్ పత్రిక తన కథనంలో ప్రస్తావించింది. 

English Title
What China can learn from India, according to Chinese state media
Related News