పురుష కమిషన్ కావాలి

Updated By ManamTue, 10/16/2018 - 00:27
kutumbam

ఉన్నట్టుండి మనదేశంలో ‘పురుష కమిషన్’ కావాలన్న డిమాండ్ ఊపందుకుంది. పెళ్లి అయినా కాకపోయినా మాకు వేధింపులు మాత్రం తప్పడం లేదంటున్న పురుష బాధితుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో ‘మీ టూ’కు గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది.  స్నేహం, ప్రేమ, పెళ్లి, విడాకులు, పిల్లలు వంటి పేర్లతో తమను జీవితంలోని ప్రతి దశలో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా మహిళలు కుంగదీస్తున్నారన్న వాదనకు గతంలో పోలిస్తే  ఇప్పుడు కాస్త ఎక్కువ బలం చేకూరుతోంది.

మెన్స్ రైట్స్..వాస్తవ్
imageమేం మనుషులం కామా? మాకు మానవ హక్కులు వర్తించవా? మాకు ఈ వేధింపుల నుంచి విముక్తి కావాలి.. ఇందుకు చట్టాలను మార్చాల్సిందేనంటూ చదువుకున్న వ్యక్తులు నయా ఉద్యమాన్ని నిర్మించారు. ముంబై కేంద్రంగా అమిత్ దేశ్‌పాండే అనే వ్యక్తి ‘మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్’గా మారి ‘వాస్తవ్’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి, భార్యా బాధితులకు చేతనైన న్యాయసేవలు అందిస్తున్నారు.  ‘‘నా భార్య 50 లక్షల భరణం అడుగుతూనే, నెలనెలా 25వేల రూపాయల మెయిన్‌టెనెన్స్ కావాలంటూ నాపై విడాకుల కేసు ఫైల్ చేసింది’’అంటూ అమిత్ ఆవేదన వ్యక్తంచేసి అందరినీ ఆలోచింపచేశాడు. అంతేకాదు తనలాంటి బాధితులు లెక్కకు మించి ఉన్నారంటూ ‘టెడ్ టాక్’లోనూ తన వాణిని వినిపించి.. అంతర్జాతీయ స్థాయికి సమస్యన7ు తీసుకెళ్లారు.  మంచి ఉద్యోగంలో ఉన్న తాను బెంగళూరు అమ్మాయిని ప్రేమించి వివాహమాడాక.. భార్య తనతో ముంబై వచ్చేందుకు ససేమిరా అనడంతోపాటు, అక్కడే ఉంటూనే రెండేళ్ల పాటు తనను అన్ని విధాలా వేధించి.. చివరికి గృహహింస చట్టం కింద కేసు నమోదు చేసి తన జీవితాన్ని బజారుకీడ్చిందం టారు. అయినా పట్టువ దలని విక్రమార్కుడిలా ఓపికగా తాను న్యాయపోరాటం చేసి చివరికి కేసు గెలిచిన తీరు పబ్లిక్‌గా వివరిస్తూ తనలా ఎవరూ వేదనకు గురికావద్దంటారు.  అసలు తనకు విడాకులు అవసరం లేదని.. తాను చక్కగా భార్యతో కలిసి ఉండాలని చేసిన ప్రయత్నాలను తన భార్య ఎలా గండికొట్టిందో అమిత్ మాటల్లో అణువణువునా ధ్వనిస్తుంది.

మేం కూడా..
తమకు నచ్చని వారి పీడ వదిలించుకునేందుకు, తమకు గిట్టని వారిపై కక్ష సాధించేం దుకు ‘మీ టూ’ మొదలైందనేimage ‘వాస్తవ్’ సభ్యులు చాలా మందే ఉన్నారు. ఇక వాస్తవాన్ని అంగీకరించే మరికొందరు ‘వాస్తవ్’ మెంబర్స్.. ఇలాగైతే తాము కూడా ‘మీ టూ’ మొదలుపెట్టి.. తాము పడుతున్న నరకయాతనను వివరించక తప్పదంటున్నారు. వరకట్న వేధింపులు, గృహహింస వంటి చట్టాల్లోని లొసుగులను ఆసరాగా చేసుకుని అమాయక భర్తల వద్ద డబ్బులు గుంజుతున్న భార్యలున్నారని, ఇక వివాహేతర సంబంధాలు వంటి విషయాలపై ఆసక్తితో తమ ప్రాణాలను సైతం తీస్తున్నారని వాపోతున్న పురుష బాధితులు, వారి బంధుమిత్రులు ‘మీ టూ’ను గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. నాణేనికి ఓ వైపు కథ ‘మీ టూ’ది అయితే మరోవైపు కథ ‘వాస్తవ్’ది అన్నమాట.

‘మీ టూ’కి చెక్
image‘వాస్తవ్’లో అంతకంతకూ స భ్యుల సంఖ్య పెరుగుతుండడమే సమస్య తీవ్రతను వివరిస్తుంది.  వెబ్‌సైట్, హెల్ప్‌లైన్ నంబరు, ఈమెయిల్, వాట్సప్ గ్రూప్ ఇలా పలు వేదికలను వాస్తవ్ సృష్టించి, ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ’ అనే స్వచ్ఛంద సంస్థలానే పురుషుల సమస్యలపై పోరాడుతోంది.  ‘మీ టూ’తో తమ పరువు, ప్రతిష్ఠ సర్వం పోయి నడిబజారులో నిలబడి దోపిడీకి గురవుతున్నట్టు వాస్తవ్ సభ్యులు లబోదిబోమంటారు.  ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈనెల 2,3 తేదీల్లో పురుష కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌కు దిగి దేశం దృష్టిని ఆకర్షించారు. బీజేపీ ఎంపీ హరిహరన్, హర్షిత్ కూడా వీరికి మద్దతుపలికారు.  భార్యల వేధింపులకు నిరసనగా వీరంతా గత వారం నాసిక్‌లో గోదావరి ఒడ్డున తమ భార్యలకు పిండప్రదానాలు చేసి సంచలనం సృష్టించారు.

English Title
we want men commission
Related News