నిజాయితీతో పనిచేస్తాం

Updated By ManamThu, 05/17/2018 - 23:19
tjac
  • పరిపాలనలో కొత్త ఒరవడి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం

  • పార్టీ కార్యాలయం ప్రారంభం.. ముఖ్య అతిథిగా చుక్కారామయ్య

tjacహైదరాబాద్: నిజాయితీ, నిబద్ధతతో పనిచేయడమే తమ లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. పరిపాలనలో కొత్త ఒరవడి సృష్టించేందుకే పార్టీని నెలకొల్పామని పేర్కొన్నారు. గురువారం నాంపల్లి మొజాంజాహి మార్కెట్ సమీపంలో టీజేఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజా సమితి నడిచిన అలియా కాలేజీ నుంచి మా తెలంగాణ జన సమితి ప్రారంభమైందని అన్నారు. 1969లో డాక్టర్ చెన్నారెడ్డి స్థాపించిన తెలంగాణ ప్రజాసమితి కార్యాలయంలోనే మళ్లీ తెలంగాణ జన సమితి కార్యాలయం ప్రారంబించామని అన్నారు. రంజాన్ మాసం మొదటిరోజు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా నగరం మధ్యలో పార్టీ కార్యాలయాన్ని నెలకొల్పామని చెప్పారు. పార్టీ కార్యకలాపాలకు, కార్యాచరణకు ఈ కార్యాలయమే కేంద్రంగా ఉంటుందన్నారు. ప్రజా ఉద్యమాల సమాహారంగా టీజేఎస్ పని చేస్తుందని, న్యాయ సమ్మతమైన సమస్యలపై ఉద్యమాలు చేసే వారు ఎవరు వచ్చినా పార్టీలోకి ఆహ్వానిస్తామని చెప్పారు. జూన్ ఒకటిన నిర్వహించే  ‘ఖమ్మం నుంచి కరీంనగర్’ వరకు నిర్వహించే సడక్ బంద్‌కు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ‘రైతు బంధు’తో రైతులకు లబ్ధి చేరకపోగా.. ఉన్నభూమి కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచి ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసేందుకు సుమారు 500 వరకు దరఖాస్తులు వచ్చాయన్నారు. తెలంగాణ జన సమితి ఇప్పటికే కోన్ని జిల్లాల  కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నెల 19 కరీంనగర్‌లో ఉమ్మడి జిల్లాలు ,కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ తెలంగాణ జనసమితి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 20 ఉమ్మడి వరంగల్ కూడా శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వం కూడా త్వరలో ప్రారంభస్తామని కోదండ రాం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చుక్కారామయ్య మాట్లాడుతూ.. తెలంగాణ జన సమితి పరిపాలన కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని అన్నారు. అంబేద్కర్ ఆలోచలను ఆచరణలో పెట్టేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

English Title
We act honestly
Related News