వాట్సాప్ వ్యసనం.. ఆ పిల్ల మాకొద్దు!

Updated By ManamSun, 09/09/2018 - 22:38
whats up

whattsappలఖ్‌నవ్: కాబోయే కోడలుకు వాట్సాప్ వాడకం ఓ వ్యసనంగా మారిపోయిందంటూ పెళ్లి రద్దు చేసుకున్నారు వరుడి తరఫు బంధువులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అమ్రోహా జిల్లా నౌగాన్ సాదత్ గ్రామానికి చెందిన ఓ వధువు, తన కుటుంబీకులతో కలిసి వరుడి కోసం ఎదురుచూస్తూ కూర్చుంది. ఇంతలో వరుడి తరఫు వారు రానే వచ్చారు. అయితే ఈ పెళ్లి జరగదని తేల్చి చెప్పేశారు. దాంతో వధువు, ఆమె కుటుంబీకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.కారణమేంటని అడగ్గా.. వధువు 24 గంటలూ వాట్సాప్‌తోనే బిజీగా ఉంటోందని, అలాంటి వ్యసనం ఉన్న కోడలు వద్దని అన్నారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య వాదన చోటుచేసుకుంది. వధువు తరఫు వారు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లికి రూ.64 లక్షలు కట్నంగా కావాలని డిమాండ్ చేశారని అది ఇవ్వనందుకు తమ కుమార్తెపై నిందలు వేస్తున్నారని వాపోయారు. ఈ మేరకు వరుడి కుటుంబీకులను పోలీసులు విచారిస్తున్నారు. జూన్‌లో బిహార్‌లోని సరణ్ ప్రాంతంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి సమయంలో వర్షం పడుతుండగా ఉరుములు ఉరమడంతో వరుడు భయపడ్డాడు. దాంతో అతని ప్రవర్తన వింతగా ఉందంటూ వధువు పెళ్లి మానుకుని వెళ్లిపోయింది.

English Title
Watsap addiction .. That kid is not for us!
Related News